రాఖీ పండగ ఏ విధంగా వచ్చిందో తెలుసా?

రాఖీ పండగ ఏ విధంగా వచ్చిందో తెలుసా?

మనదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో రాఖీ పండుగ ఒకటి. ఈ పండుగను రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. ఈ పండగ ఏ విధంగా వచ్చిందో పురాణాలలో కథలుగా ఉన్నాయి.

ఈ రాఖీ పండుగను శ్రావణమాసంలో పౌర్ణమి రోజుని జరుపుకుంటారు. మరియు ఆయురారోగ్యాలతో చేసిన పనులు విజయం సాధించడానికి కూడా ఈ పండగను జరుపుకుంటారు. ఈ రక్షాబంధన్ అన్నా,చెల్లెళ్లకే కాదు భార్యా,భర్తలకు కూడా. దీనిలో మనం ఆలోచించాల్సింది బంధం గురించి కాదు రక్షగా ఉండడం గురించి.  

పూర్వం దేవతలకు, రాక్షసులకు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇలా ఒక యుద్ధంలో ఇంద్రుడు ,బలి చక్రవర్తి చేతిలో ఓడిపోయాడు. ఇది చూసిన ఇంద్రుని భార్య సచిదేవి బాధతో  మహావిష్ణువుని కలిసి నా భర్తకు విజయం లభించాలి అంటే నేను ఏం చేయాలని అడుగుతుంది.

విష్ణువు పత్తితో తయారైన ఒక పవిత్రధారాన్ని సచీదేవికి ఇచ్చి, ఇంద్రుని చేతికి రక్షణగా కట్టమనగా, ఇంద్రుని భార్య మహావిష్ణువు చెప్పినట్లుగా ఇంద్రుని చేతికి కడుతుంది. ఇంద్రుడు బలి చక్రవర్తి తో యుద్ధంలో తిరుగులేని విజయంని పొందుతాడు. స్త్రీలు తమ మగవారికి రక్షణగా కట్టే దారాన్ని రక్షాబంధన్ అంటారు.

సచిదేవి ఇంద్రునికి కట్టిన రాఖి ప్రపంచంలో మొట్టమొదటి రాఖీగా పిలవబడింది. పూర్వం స్త్రీలు విజయం పొందాలని రక్షణగా, ఉండాలని ఈ రాఖీని చేతికి కంకణం లాగా కట్టేవారు. అలాగే చత్రపతి శివాజీ భార్య కూడా శివాజీ చేతికి రాఖీ కట్టి యుద్ధానికి పంపించేదని కథలలో ఉంది. ఈ విధంగా రాఖీ పండుగకు ఉదాహరణగా ఈ కథను చెబుతారు.

 మహాభారతంలో కూడా రాఖీ పండుగకు ఉదాహరణగా ఒక కథ చెబుతారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడనే రాక్షసుడుని చంపాలని తన చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని విడుస్తాడు. ఆ క్రమంలో సుదర్శన చక్రం చేతికి తగిలి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపతి తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని చేతికి కడుతుంది.

నన్ను అన్నగా భావించావు నీకు ఎలాంటి సమస్య వచ్చిన నన్ను తలుచుకో నేను వచ్చి రక్షిస్తానని ద్రౌపతికి శ్రీకృష్ణుడు చెప్పాడు. తర్వాత కొంతకాలానికి కౌరవులు ద్రౌపది చీరను లాగే నిండు సభలో అవమానించాలని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపదిని కాపాడి అనేక వస్త్రాలను బహుమతిగా ఇస్తాడు.

ఈ సంఘటన ద్వారాక కూడా రక్షాబంధన్ జరుపుకుంటారని మన పూర్వీకులు చెబుతారు. ఏదేమైనా ఎలాంటి సందర్భమైన రక్షణగా కట్టే బంధం గురించే చెబుతుంది.

భార్యా,భర్తల బంధానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే, అదేవిధంగా మన తోబుట్టువుల బంధం మన జీవితానికి ఎంత ప్రాముఖ్యతమైనదో చెప్పటానికి, మరియు అన్నా చెల్లెల బంధానికి అంత ప్రాముఖ్యత ఉందని అందువలన రక్షాబంధన్ పండుగను తోడపుట్టిన అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు మాత్రమే జరుపుకుంటారని తెలుస్తుంది.

ఈ కథల ద్వారానే మనదేశంలో రాఖీ పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా ఈ రాఖీ పండుగకు మరొక విశిష్టత కూడా ఉంది. ఈ పండగ శ్రావణమాసంలో పౌర్ణమి రోజు వస్తుంది. పూర్వం వేద పాఠశాలలో, గురుకులాలలో కొత్త విద్యార్థులు వస్తారు. వారికి శ్రావణపౌర్ణమి రోజునే ఉపనయనం చేస్తారు. కొందరికి ఉపనయనం పాతబడి తెగిపోయేట్టుగా ఉంటే ,అలాంటి వారు కూడా ఈ రోజున మార్చుకుంటారు.

వేదాలను సామాన్యులకు అర్థం అయ్యే విధంగా చేసినందుకు ఋషులను మహర్షులను ఈ రోజున పూజిస్తారు. అందుకే ఈరోజును ఋషిపర్వం అని కూడా పిలుస్తారు. అంతేకాక దేశవ్యాప్తంగా సాంస్కృత దినోత్సవం గా కూడా చెబుతారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker