Vijay,Rashmika: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక వీడియో
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగ, స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ , అలాగే హీరోయిన్ రష్మిక మందన. కొంతకాలంగా సోషల్ మీడియాలో వీరికి సంబంధించి కొన్ని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
వీరిద్దరూ కలిసి హాలిడేస్ ని ఒకే చోట ఎంజాయ్ చేస్తున్నారు అంటూ, అలాగే మరోసారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటూ, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా మరో రూమర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.”గీత గోవిందం అనే మూవీ ద్వారా ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఈ మూవీ చేశారు.
ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా ఉంది. ఈ కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ కూడా అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పేయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ హిట్ పేయిర్ తో వెంటనే “డియర్ కామ్రేడ్ “అనే మూవీ చేశారు.
ఈ రెండు మూవీస్ చేసే సమయంలోనే వాళ్ళిద్దరికీ లవ్ కుదిరింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ టైం లో నే విజయ్ దేవరకొండ, రష్మిక మందన డేటింగ్ లో ఉన్నారంటూ కూడా మరో వార్త సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి వినిపిస్తుంది. కొన్ని హింసను కూడా ఈ జంట ప్రేక్షకులకు ఇస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హోటల్ లకి కలిసి వెళుతూ ఉంటారు అంటూ రూమర్స్ వినిపిస్తేనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో మాల్దీవులకి కూడా వెకేషన్ కోసం ఇద్దరూ ఒకే ప్రాంతానికి వెళ్లారని చెప్పి స్పెషల్ మీడియా వార్తల ద్వారా షేక్ అయింది. వీరిద్దరూ లవ్ లో ఉండకపోతే ఎందుకు అన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి అని అంటున్నారు నేటిజన్స్.
రీసెంట్ గా కొత్త సంవత్సరం వేడుకలు కూడా కలిసే జరుపుకున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన ఇంస్టాగ్రామ్ పేజీలో న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక మందన లైవ్ సెషన్ ఏర్పాటు చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యాన్స్ కి, ఫాలోవర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
ఇది ఇలా ఉంటే లైవ్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటే రష్మిక వాయిస్ తో పాటు విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపించింది అంటూ నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ పరిస్థితి రావడం వల్ల ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ జరుపుకున్నారు అంటూ అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్లో వెకేషన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు అభిమానులతో షేర్ చేసుకున్న పిక్చర్స్ లో వెదర్ దాదాపు ఓకే రకంగా ఉంది అంటూ అభిప్రాయపడ్డారు.
ఇక మీరిద్దరి సినిమాల విషయానికొస్తే రష్మిక మందన “వారసుడు”అనే మూవీ ద్వారా ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేయబోతుంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే “లైగర్” మూవీ తర్వాత “ఖుషి “మూవీ లో నటిస్తున్నాడు.