Elon Musk:ట్విట్టర్లో కొత్త ఫీచర్స్
ఇటీవల కాలంలో మైక్రోబ్లాంగింగ్ సైట్ ట్విట్టర్ టేక్ ఓవర్ చేసిన వ్యక్తి ఎవరంటే ఎలాన్ మస్క్. ఈయన ట్విట్టర్ కొత్త బాస్. బిలియనీర్ కూడా. ఈయన రెండు సంస్థలకు సీఈవో కూడా.ఈయన ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అనూహ్య సంస్కరణలను చేపడుతున్నానని మరో సరికొత్త అంశాన్ని ప్రకటించారు.
ఈయన ట్విట్టర్లో కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నాడు. ఏ యె ట్విట్టర్ అకౌంట్స్ ఏ యే సంస్థలకు అనుసంధానంగా ఉన్నాయో గుర్తించేందుకు ఆయా సంస్థలు అనుమతినిస్తాయని ఆదివారం రోజు ట్విట్టర్లో ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఈ ఫీచర్ ని త్వరలోనే తీసుకొస్తున్నానని చెప్పడం జరిగింది.
ఈ విషయంపై ఒక యూజర్ స్పందన-
ట్విట్టర్ ద్వారా ఒక కొత్త ఫీచర్ను తీసుకురాబోతున్నాడు అన్న విషయంపై ఒక యూజర్ స్పందించి ఈ విధంగా ప్రశ్నించాడు. “ఏ ఖాతాదారుడు ఏ ఆర్గనైజేషన్కు చెందినవాడో ట్విట్టర్ డిసైడ్ చేస్తుందన్నమాట అని ప్రశ్నించాడు.
అటు ఆటోమేకర్ టెస్లా చీఫ్ గా ఉంటూ ఇటు ట్విట్టర్ని సొంతం చేసుకొని ఇలా రెండు సంస్థలకు సీఈఓ గా ఉన్నాడు. ఈయన ఇలా రెండు పెద్ద సంస్థలకు సీఈఓ గా ఉంటూన్న క్రమంలో వీటిని రెండింటిని మేనేజ్ చేయగలడా లేదా దీని ప్రభావం టెస్లాపై పడనుందా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉదయం నుండి రాత్రి వరకు, వారంలో రెండు రోజులు, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఎక్కువగా పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈయన ట్విట్టర్ ని 44 బిలియన్ డాలర్ల కు కొనుగోలు చేశాడు.
ట్విట్టర్ కొన్న తర్వాత ఎలాన్ మాస్క్ చేస్తున్న సంస్కరణలు:-
అనేక సంస్కరణలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్లపై వేటు, బోర్డు రద్దు, కంపెనీలో సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన, బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు లాంటి సంస్కరణలు కూడా చేసుకుంటూ వచ్చాడు.
బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు పై మస్క్ వెనక్కి తగ్గినప్పటికీ వచ్చేవారం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావచ్చుననీ ట్వీట్ చేశాడు. అయినా పూర్తి ఫీజు ఎంతో, ఎంతకు నిర్ణయించాడో క్లారిటీ ఇవ్వలేదు. అధికారిక హ్యాండిల్స్ ని ఎలా గుర్తించాలో కూడా చెప్పలేదు. మరికొన్ని దేశాల్లో ట్విట్టర్ స్లోగా ఉండడం పై ఆయన స్పందించి క్షమాపణలు కూడా చెప్పాడు. ట్విట్టర్ ద్వారా కొత్త ఫీచర్ ని తీసుకురాబోతున్నాడు ఎలాన్ మాస్క్. ట్విట్టర్ని 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు.