మనలో చాలామంది స్మార్ట్ ఫోన్, అలాగే స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ లను చూసి ఉంటాం. కానీ తాజాగా Xiamo కంపెనీ స్మార్ట్ ఫ్యాన్ ని తీసుకురావడం జరిగింది.దాని పేరు Xiaomo smart standding fan 2. ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఫ్యాన్ రావడం ఇదే మొదటిసారి.
దీనినీ చాలా రకాలుగా ఉపయోగ పడే విధంగా తీసుకురావడం జరిగింది.దీనిలో వుండే ఫ్యూచర్స్ ఇంతకు ముందు వచ్చిన ఏ ఫ్యాన్ లో కూడా లేకపోవడం విశేషం. ఈ ఫ్యాన్ తేలికపాటి బరువుతో రావడం జరిగింది.
స్మార్ట్ ఫ్యాన్ యొక్క బరువు మూడు కిలోల కంటే తక్కువగా ఉంటుంది.ఎక్కువ ఎత్తులో కావాలని అనుకుంటున్న వారికి కోసం అదనంగా రాడ్ ను కూడా అందిస్తున్నారు.ఫ్యాన్ BLDC కాపర్ వైర్ మోటార్ ను ఉపయోగిస్తుంది, అల్యూమినియం వైర్ మోటర్ కంటే ఎక్కువ ఆపరేటింగ్ సామర్థ్యం ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫ్యాన్ డ్యూయల్ ఫ్యాన్ బ్లేడ్లతో నిర్మితమై ఉంటుంది.సహజమైన గాలి కోసం ఫ్యాన్ అసాధారణమైన నిశ్శబ్ద మరియు అంతరాయం కలుగని అనుభవాన్ని అందించడానికి ఆప్టిమైజ్ చేయబడింది.
మనం కోరుకున్న గాలి ప్రవాహాన్ని పొందడానికి Xiaomi యాప్ లో ఫ్యాన్ వేగాన్ని 1 నుంచి 100 వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు.Google మరియు Alexa ను ఉపయోగించి ఒకే వాయిస్ కమాండ్ తో ఫ్యాన్ నీ వాడవచ్చును.
ఈ స్మార్ట్ ఫ్యాన్ వాష్ చేయదగిన ఫ్రేమ్ లో సులభమైన ఆరు భాగాలుగా ఉంటుంది.
ఈ ఫ్యాన్ తక్కువ పవర్ రేటింగ్ తో పనిచేసేలా ఉంటుంది.అంతేకాకుండా దీనిని మనమే స్వయంగా ఒక్క నిమిషం లో ఫ్యాన్ భాగాలను కలపడం చేయవచ్చును.