YS రాజశేఖర రెడ్డి సంస్మరణ సభ నేడే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి సంస్మరణ సభ నేడే జరగనుంది. హైదరాబాద్ హైటెక్స్ లో YS సతీమణి, YSRCP గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నిర్వహించనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
వైఎస్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి YS విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలంటూ 300 మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఇందులో YS సన్నిహితులుగా మెలిగిన పలువురు రాజకీయ నాయకులు, IAS, IPS,అధికారులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సినీప్రముఖులు ఉన్నా రు. విజయమ్మ గారు స్వయంగా కొందరికీ ఫోన్ చేసి ఆహ్వానించారు.
ఆహ్వానితులు లో MP D. శ్రీనివాస్, PCC మాజీ అధ్యక్షుడు, MP లు KVP రామచంద్ర రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ లతోపాటు పలు పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రాజా నరసింహ, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, సునీత, లక్ష్మారెడ్డి, గీతా రెడ్డి, శ్రీధర్ బాబు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి,MA ఖాన్, అసదుద్దీన్ ఒవైసీ, సురేష్, తదితరులకు ఆహ్వానం పంపించినట్లు వెల్లడించారు. వీరితో పాటుగా మాజీ IAS officers, మోహన్ కందా, బిపి ఆచార్య, రమాకాంత్ రెడ్డి, సినీ నటులు నాగార్జున, చిరంజీవి,కృష్ణ, దిల్ రాజు మరియు రిటైర్డ్ జడ్జీలు, జర్నలిస్టులు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ సభలో ఆహ్వానితులు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని సమాచారం. సభ పర్యవేక్షకులుగా మాజీ IAS officer ప్రభాకర్ రెడ్డి, YS వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన భాస్కర్ శర్మ పర్యవేక్షిస్తున్నారు.