ఈ వారం రాశి ఫలాలు. మీ జాతకం మారిందో లేదో తెలుసుకోండి!
మేషం:
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆర్థిక వృద్ధి మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేయాలనుకున్న పనులను పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహములో శుభకార్యాలను జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
వృషభం:
కృతికి 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగాలలో, వృత్తిలో ఊహించని అడ్డంకులు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి. ముఖ్యమైన పనులలో మిత్రుల సలహాలను తీసుకుంటారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ప్రతిభను ఘనపరుస్తారు. ఇష్టమైన దేవుని ప్రార్థిస్తే శుభవార్తలను వింటారు.
మిధునం:
మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు.
స్థిరాస్తి వివాదాలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలను ఆర్జిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు పలిస్తాయి. అనవసర ఖర్చులను చేయకుండా ఉండటం మంచిది. శ్రీకాల భైరవాష్టక స్తోత్రం చదవటం వల్ల శుభాలను పొందుతారు.
కర్కాటకం:
పునర్వసు 4 వ పాదం; పుష్యమి, ఆశ్లేష.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అడ్డంకులను అధిగమిస్తారు. చాలా కాలంగా అడ్డంకులు వచ్చి ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. వ్యాపారాల్లో, ఉద్యోగాలలో అనంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శుభకార్యాలలో బంధుమిత్రుల సూచనలను పాటించడం మంచిది. అన్ని మార్గాలలో ఆర్థికంగా పెరుగుతారు. కార్తికేయ స్తోత్రం చదవటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
సింహం:
ముఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
వృత్తి వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలను ఆశించిన విధంగా పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు, ఆప్తుల నుండి కొంత ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగాలలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. పలుమార్గాలలో ఆర్థిక వృద్ధిని పొందుతారు. ఉద్యోగ అవకాశాలు ఫలించవు. లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.
కన్య:
ఉత్తర 3,3,4 పాదాలు హస్త, చిత్తా, 1,2పాదాలు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అపార్ధాలు తొలగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అడ్డంకులు వస్తాయి. ఉద్యోగాలలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను పూర్తి చేస్తారు. విష్ణు సహస్రనామం చదువుకోండి. ఇలా చేయడం వల్ల ప్రశాంతత జీవితం లభిస్తుంది.
తుల:
చిత్త3,4 పాదాలు, స్వాతి, విశాఖ, 1,2,3 పాదాలు.
ఉద్యోగంలో కోరుకున్న ఫలితాలను పొందుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ఫలితం లభించదు. దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగాలలో వచ్చే అడ్డంకులను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మామూలుగానే ఉంటుంది. పంచముఖ హనుమాన్ కవచం చదవడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.
వృశ్చికం:
విశాఖ 4వ పాదం; అనురాధ, జైష్ట.
అన్ని రంగాల్లో విజయాన్ని పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు మెరుగుపడతాయి. స్థిరాస్తి విషయంలో విజయాన్ని పొందుతారు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపును పొందుతారు. ముఖ్యమైన కార్యాలపై దృష్టితో అభివృద్ధిని కోరుకుంటారు. రామచంద్ర అష్టకం పారాయణం చేయడం వలన శుభాలు కలుగుతాయి.
ధనస్సు:
మూల,పూర్వాషాడ ఉత్తరాషాడ 1 పాదం.
అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. స్థిరాస్తి గొడవలు పరిష్కరించుకోవటానికి కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సర్వాష్టక స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
మకరం:
ఉత్తరాషాడ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట, 1,2 పాదాలు.
ఆరోగ్య విషయంపై శ్రద్ధగా ఉండాలి. స్థిరాస్తి గొడవలు పరిష్కారం మార్గంగా వెళతాయి. చేయాలనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారం లాభాల దిశగా పరుగేడుతుంది. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అడ్డంకులు వచ్చిన బుద్ధి బలంతో ముందుకు వెళతారు. శ్రీ కృష్ణ చంద్రష్టకం చదవడం మేలు శుభం కలుగుతుంది.
కుంభం:
ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
ఉద్యోగ అవకాశాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులలో విజయాన్ని పొందుతారు. వృత్తి వ్యాపార విషయంలో సొంత నిర్ణయాల వల్ల లాభాలను పొందుతారు. అన్ని రంగాలలో ఆశించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అడ్డంకులు వచ్చిన బుద్ధిబలంతో విజయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో దేవాలయాలను దర్శిస్తారు. నవగ్రహ స్తోత్రం చదవటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు.
మీనం:
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గి అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వెంకటేశ్వర స్తోత్రం చదవటం వల్ల శుభ సంకల్పాన్ని పొందుతారు.