Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అసైన్డ్ భూముల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు నిర్మించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలో ఇటువంటి ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు కూడా జారీ చేసింది.

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకురు గ్రామంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎస్సి కుటుంబాలకు కేటాయించిన స్థలంలో జరిగింది. ఈ కేటాయించిన స్థానాలలో ప్రభుత్వ నిర్మాణాలు వచ్చినందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ గడ్డం చంద్రశేఖర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. శ్రావణ్ కుమార్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల పట్టాల లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

కాగా ఇదివరకే ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో సచివాలయాల నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker