ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఉద్యోగులకు సబ్సిడీ కింద ఎలక్ట్రికల్ వాహనాలు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఉద్యోగులకు సబ్సిడీ కింద ఎలక్ట్రికల్ వాహనాలు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎలక్ట్రిక్ బైక్ పై కార్యాలయాలకు రానున్నారు. ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా ఆథర్,ఓలా, బిగాస్, హీరో, టీవీఎస్, కైనెటిక్, వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్కాబ్, బ్యాంక్ ఆఫ్ బరోదా,ఇన్ఫ్రాస్ట్రక్టర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (IDF) వంటివి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తాయి.
- ఓలా, ఆథర్, హీరో వంటి 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం
- ఏడాదికి లక్ష వాహనాలు అందించాలని లక్ష్యం
- దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన నెడ్క్యాప్
ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (NED CAP) తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు: చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్ (NED CAP) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే AP ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందుకు అవసరమైన ఒప్పందాలను చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (NED CAP). ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తే,..విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకోగానే మూడు గంటల పాటు చార్జింగ్ పెడితే చాలు.. రోజంతా ఈ స్కూటర్ నడుపుకోవచ్చు. పైగా పెట్రోలు భారం కూడా తప్పుతుంది.
ఛార్జింగ్ పెట్టుకునేందుకు.
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నెడ్ క్యాప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, RTC బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.