Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

ప్రజావ్యతరేక విధానాలను విడనాడాలి

ప్రజావ్యతరేక విధానాలను విడనాడాలి : కర్నూలు , తుగ్గలి సెప్టెంబర్ 27: బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నిర్వహించిన భారత్ బంద్ లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సిపిఐ, సిపిఎం ,టిడిపి , వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, సిపిఐ నాయకులు మాజీ జిల్లా పరిషత్తు కో ఆప్షన్ సభ్యులు నబి రసూల్, మండల సిపిఐ కార్యదర్శి రోళ్ళపాడు వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి ఉప్పరపల్లి శ్రీ రాములు లు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసువచ్చి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు.

తక్షణమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరో పక్క రాష్ట్రంలో విశాఖ ఉక్కు , ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని, తక్షణమే ప్రైవేటీకరణ ను నిలుపుదల చేయడానికి ప్రజలు ఏకం కావాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పోరాటాలు ద్వారా ముందుకు సాగాలని అన్నారు.

మోడీ పాలనలో మహిళలు, గిరిజనులు, దళితులపై దాడులు పెరిగాయని, ప్రశ్నిస్తున్న వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని, ఆదాయ పన్ను పరిధి వెలుపల ఉన్న కుటుంబాలకు నెలకు రు.7,500 ఇవ్వాలని, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల హక్కులకు రక్షణ కల్పించాలని, ఉపాధి హామీ క్రింద 200 పని దినాలు కల్పించాలని అన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక హక్కులను రక్షించాలని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లు లు పాల్గొన్నారు ఈ సందర్భంగా తుగ్గలి ,జొన్నగిరి ఎస్ ఐ లు సమీర్ భాష, రామాంజనేయులు లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker