అనంతపురం జిల్లాలో పోలీసులకు LLR మేళా
అనంతపురం జిల్లాలో పోలీసులకు LLR మేళా
- జిల్లా ఎస్పీ ఆదేశాలతో హిందూపురం, గుంతకల్లు, రాయదుర్గం, కదిరి పట్టణాలలో 216 మంది పోలీసులకు LLR లు అందజేత
- జిల్లాలో ప్రతీ పోలీసు డ్రైవింగ్ లైసెన్స్ కల్గి ఉండాలన్నదే జిల్లా ఎస్పీ సంకల్పం
- జిల్లాలో గత 20 రోజులలో 673 మంది పోలీసులకు LLR లు జారీ
అనంతపురం జిల్లాలో పోలీసులకు LLR మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాలతో హిందూపురం, గుంతకల్లు, రాయదుర్గం, కదిరి పట్టణాలలో ఈ మేళాలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ లేని 216 మంది పోలీసులకు LLR లు అందజేశారు. హిందూపురంలో 98 మందికి… రాయదుర్గంలో 45… కదిరి 38 … గుంతకల్లులో 39 మంది పోలీసులకు LLR లు జారీ చేశారు. జిల్లాలో ప్రతీ పోలీసు డ్రైవింగ్ లైసెన్స్ కల్గి ఉండాలన్నదే జిల్లా ఎస్పీ సంకల్పం.
ఇందులో భాగంగానే 20 రోజుల కిందట జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో డ్రైవింగ్ లైసెన్స్ లేని పోలీసులకు పరీక్షలు నిర్వహించి 457 మందికి LLR లు అందజేశారు. ప్రజలపై చలానాలు జారీ చేయాలంటే ముందు మనం కరెక్టుగా ఉండాలి. పోలీసులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సందర్భాలలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రయోజనాలు పక్కాగా అందుతాయి. అందుకే ఈ మేళాలు నిర్వహించి 30 రోజుల తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా ఎస్పీ చర్యలు తీసుకున్నారు.