AP EAPCET: మూడు దశల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం
ఎంసెట్ కౌన్సిలింగ్ 21 నుంచి ప్రారంభమవుతుంది. తొలి దశలో వచ్చే నెల 6న సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడు దశల్లో కౌన్సిలింగ్, అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ ఉంటుంది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఆగస్టు 21వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకుగాను మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నిమిత్తం ఆగస్టు 21 నుండి 29వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేసుకుంటారు. సెప్టెంబర్ 6న సీట్ల కేటాయింపు. రెండో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. సీట్లను అక్టోబర్ 4వ తేదీన ప్రకటిస్తారు. మూడవ దశ కౌన్సిలింగ్ అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 17వ తేదీన సీట్లను కేటాయిస్తారు అక్టోబర్ 17వ తేదీ నుంచి 21 తేదీన మధ్య కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మూడు దశల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా సీట్లు మిగిలినట్లయితే అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది.
షెడ్యూల్
1వ దశ కాన్సెలింగ్
1 ఆన్లైన్ స్లాట్ బుకింగ్-ఆగస్టు21 నుండి 29 వరకు
2 సర్టిఫికెట్ వెరిఫికేషన్-ఆగస్టు 23 నుండి 30 వరకు
3 ఆన్లైన్ నమోదు-ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు
4 సీట్ల కేటాయింపు-సెప్టెంబర్ 6 వ తేదీన
5 ఫీజు చెల్లింపు- సెప్టెంబర్ 6 నుండి 13వ తేదీ వరకు
2వ దశ కౌన్సిలింగ్
1 ఆన్లైన్ స్లాట్ బుకింగ్-ఆగస్టు 28 నుండి 29 వరకు
2 సర్టిఫికెట్ వెరిఫికేషన్- ఆగస్టు 30 న
3 ఆప్షన్ల నమోదు-ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 1 వరకు
4 సీట్ల కేటాయింపు-అక్టోబర్4 తేదీన
5 ఫీజు చెల్లింపు-అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 8 వరకు
3వ దశ కౌన్సెలింగ్
1 ఆన్లైన్ స్లాట్ బుకింగ్-అక్టోబర్ 11 నుండి 12 వరకు
2 సర్టిఫికెట్ వెరిఫికేషన్- అక్టోబర్ 13న
3 ఆప్షన్ల నమోదు-అక్టోబర్ 11 నుండి 14 వరకు
4 సీట్ల కేటాయింపు-అక్టోబర్ 17న
5 ఫీజు చెల్లింపు-అక్టోబర్ 17 నుండి 20వ తేదీ వరకు
కాలేజీలో రిపోర్టింగ్-అక్టోబర్ 17 నుండి 21 తేదీ లోపు చేయాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్-అక్టోబర్ 20వ తేదీన జరుగుతుంది.