Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.

నిర్దేశించిన గడువు లోగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకంలో పురోగతి

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకం కింద వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు జరగాలి :-

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో జిల్లా మొదటి, రెండవ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలి :-

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలి :-

జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి :-

ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ను ప్రతి ఒక్కరూ అచీవ్ కావాలి :-

పనితీరు మెరుగు పడకపోతే చర్యలు :-

సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :-

కర్నూలు, ఆగస్టు 31:-

నిర్దేశించిన గడువు లోగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో పురోగతి కనిపించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను హెచ్చరించారు.

మంగళవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో   నంద్యాల డివిజన్ స్థాయిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు- ఇంటి నిర్మాణాల పురోగతి, ఇంటి పట్టాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాల పురోగతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, వ్యవసాయ శాఖ, సర్వే మరియు రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు, కోవిడ్ – 19 తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరావు సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య,  జిల్లా అధికారులు, నియోజక వర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో జిల్లా మొదటి, రెండవ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులు అందరూ సీరియస్ గా తీసుకుని కలిసికట్టుగా పనిచేసి అన్ని విషయాల్లోనూ జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం సంబంధించి నంద్యాల రెవెన్యూ డివిజన్ లో 13,400 ఇళ్లు మంజూరయ్యాయని, కోర్టు కేసులు మినహా మిగిలిన ఇళ్ళ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు.

నంద్యాల రూరల్ లో ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయని హౌసింగ్ ఏఈని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా 1376 ఇళ్లు   మంజూరయ్యాయిని, ఇందులో ఇంకా 259 ఇల్లు పనులు మొదలు పెట్టలేదని, 763 బిలో బేస్మెంట్ లెవెల్, 56 బేస్మెంట్ లెవెల్, 26 రూఫ్ కాస్ట్ లెవల్లో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కు ఏఈ వివరించగా వెంటనే జిల్లా కలెక్టర్ నంద్యాల రూరల్ పరిధిలో అధిక సంఖ్యలో ఇళ్ల పనులు ఇంకా మొదలు పెట్టలేదని ఎందుకు పెండింగ్ లో ఉన్నాయిని ప్రశ్నించి సంబంధిత హౌసింగ్ ఈఈ, ఏఈలకు షోకాజ్ జారీ చేసి వివరణ కోరాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

నంద్యాల అర్బన్ సంబంధించి 7630 మంజూరు కాగా అందులో 1481 ఇళ్ల పనులు మొదలు పెట్టలేదని, 673 గృహాలు బిబిఎల్ దశలో ఉన్నాయని, 78 పునాది స్థాయిలో ఉన్నాయని, ఆళ్లగడ్డ మండలానికి సంబంధించి 1531 గృహాలలో  49 గృహాలు ఇంకా పనులు మొదలు పెట్టలేదని, 1061 బిబిఎల్ దశలో ఉన్నాయని, పాణ్యం మండలానికి సంబంధించి 1255 మంజూరు కాగా 180 గృహాలు ఇంక మొదలు పెట్టలేదని, 1055 గృహాలు బిబిఎల్ దశలో ఉన్నాయని, ఆత్మకూరు అర్బన్ సంబంధించి 1608 గృహాలలో 151 గృహాలు పనులు ఇంక మొదలు పెట్టలేదని, 1229 గృహాలు బిబిఎల్ దశలో ఉన్నాయని వెంటనే పనులు మొదలు పెట్టాలని హౌసింగ్ ఏఈను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒకటిన్నర సంవత్సరం క్రితం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం తీసుకొచ్చిందని, కింద స్థాయిలో ఆశించినంత మేరకు ఇంకా పనులు మొదలు పెట్టలేదని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలం వారీగా ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, పొజిషన్ సర్టిఫికేట్ లు ఎన్ని ఇచ్చాం, ఎన్ని లేవుట్ లు ఉన్నాయి, వాటిలో ఎన్ని గృహాలు గ్రౌండింగ్ లో ఉన్నాయి తదితర వివరాలను గురువారం లోగా తనకు అందజేయాలని హౌసింగ్ పీడీను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్ ఇంజనీర్లు, మండల ఆఫీసర్ లు సమన్వయంతో టీమ్ గా పనిచేసి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్లు హౌసింగ్ ప్రోగ్రాం పై మానిటరింగ్ చేస్తూ సంబంధిత ఇంజనీర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల చెంతకే పాలన అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ తదితర కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నూతన వ్యవస్థను తీసుకొచ్చారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కలను నెరవేర్చేందుకు భవన నిర్మాణ పనులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి భవనాలను వెంటనే అప్పజెప్పాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో 46 ఆర్ బికెలు మంజూరు కాగా ఇంకా 17 ఆర్ బికెలు ప్రారంభించలేదని, ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ 81 ఆర్ బి కెలు మంజూరు కాగా 30 ఆర్ బికెలు ప్రారంభించలేదని వచ్చే శనివారం నాటికి ఆ పనులుప్రారంభించాలని పంచాయతీరాజ్ డిఈలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆత్మకూరు సబ్ డివిజన్ లో గ్రామ, వార్డు సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీలు ఎన్ని మంజూరయ్యాయని డిఈను జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా 186 మంజూరు అయ్యాయని, 10 వాటికి స్థల సమస్యలు ఉన్నాయని పంచాయతీ రాజ్ డిఈ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రెండు రోజుల్లో స్థలాలు కేటాయించి అప్పజెప్పాలని సంబంధిత తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జాతీయ ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని ఉపాధి హామీ పథకం ఏపీడిలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ లో 97 శాతం సాధించామని, ఉపాధి హామీ పధకం లో లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ లో మన జిల్లా ముందంజలో ఉండేందుకు ఉపాధి హామీ పథకం అధికారులు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి పనులు కల్పించాల్సిన బాధ్యత ఉపాధి హామీ పథకం సిబ్బందిపై ఉందన్నారు.

నంద్యాల డివిజన్ సంబంధించి లేబర్ బడ్జెట్ లో చాగలమర్రి 149.41, బండి ఆత్మకూరు 125.54, ఆళ్లగడ్డ 123.30, గోస్పాడు 118.64, సిరివెళ్ల 113.16, మహానంది 104.07, నంద్యాల రుద్రవరం 103.91, నంద్యాల 103.81 శాతం అధిగమించాయిని ఇందులో చాగలమర్రి 149.41 శాతం సాధించడంతో చాగలమర్రి ఏపీడిని జిల్లా కలెక్టర్ అభినందించారు. లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ వంద శాతం లోపు ఉన్న గడివేముల 79.66, బనగానపల్లె 92, కొలిమిగుండ్ల 75.33, కోయిలకుంట్ల 79.42, అవుకు 75.89, ఉయ్యాలవాడ 68.73, సంజామల 65.88, దొర్నిపాడు 63.86 శాతం లేబర్ బడ్జెట్ లో అచీవ్ కాలేదని ,ప్రత్యేక దృష్టి పెట్టి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే సిబ్బంది నిర్లక్ష్యాన్ని విడనాడి తమకు నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలని అలా లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఉపాధి హామీ కింద అవెన్యూ ప్లాంటేషన్ కు సంబంధించి నంద్యాల డివిజన్ కు సంబంధించి 78.49 శాతం సాధించామని శనివారం నాటికి ఇంప్రూవ్ చేసి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 45.21 శాతం ప్లాంటింగ్ పూర్తయిందని, ఆ క్లస్టర్ ఏపీడి లు ప్లాంటేషన్ ప్రోగ్రాంలో వారంలోగా ఇంప్రూవ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker