ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేటతెల్లమయింది: సజ్జల
సంక్షేమ పాలన పక్కదోవ పట్టించేందుకు ఇలాంటి కేసులు
Amaravati: సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన’ పిల్ ను న్యాయస్థానం కొట్టి వేయడం ద్వారా చివరికి న్యాయమే గెలిచిందినీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
తాడేపల్లి వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గాలి పోగేసి లేని ఆరోపణలు చేస్తూ అవకాశం ఉంది కదా అని న్యాయస్థానాల వద్దకు ఎంపీ రఘురామ వెళ్లారని చెప్పారు.
ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు కాబట్టి ఆయన కేసు వేసిన రోజు గ్రహించాం అన్నారు. కేసు దాఖలు చేసిన వారు కోర్టులపై కూడా అనుమానాలు వ్యక్తం చేసేలా దుస్సాహసానికి పాల్పడుతున్నారు. ఈ కేసులో వచ్చే తీర్పుపై TDP అనుకూల చానల్లో చర్చలు జరిగాయని, ఓటింగ్ కూడా నిర్వహించారన్ని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ సాగిస్తున్న సంక్షేమ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కేసులు వేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం కాకుండా చూడాలని ఇటీవల పలు కేసుల్లో సూచించిందని గుర్తు చేశారు. దీనిపై కోర్టులో ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ సమావేశానికి షేక్ కార్పొరేషన్ చైర్మన్ పర్సన్ ఆశా బేగం అధ్యక్షత వహించారు. మైనార్టీల విద్యా, ఉద్యోగ అవకాశాలు వెనకబడి ఉంటారని గమనించి దివంగత వైయస్సార్ విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారనీ, ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. మైనార్టీల హృదయాల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా ఉంటారని, ముఖ్యమంత్రి అంజాద్ భాషా అన్నారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, అప్పి రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వై వెంకట్రాంరెడ్డి, ఏపీ ఏపీఎండీసీ చైర్ పర్సన్ షమీమ్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.