• పద్మశాలి కార్పొరేషన్ సమావేశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాడేపల్లి: అట్టడుగులో ఉన్న బీసీ కులాలను, ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి చేయడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీ ల సమస్యలను, బీసీ లోన్ రాజకీయంగా వాడుకుంటూ వారికి సమాజంలో కనీస గుర్తింపు లేకుండా చేసిన వైనాన్ని సీఎం జగన్ తన పాదయాత్రలో చేశారని చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బీసీల అభ్యున్నతి కోసం కసరత్తు
మొదలు పెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీలలో చాలామందికి తెలియని కులాలను కూడా వెతికి కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. ఆ కార్పొరేషన్ లతో ప్రతి బీసీ కులాన్ని చైతన్యవంతంగా మార్చడం సీఎం జగన్ గారి ఆశయమని వెల్లడించారు.
తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పద్మశాలి కార్పొరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి కళాత్మకమైన చేతి వృత్తి చేనేత అని, ప్రపంచంలోనే చేనేత వస్త్రాలకు గొప్ప ఆదరణ ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న ఆఖరికి వ్యక్తికి అందేలా చూడటం మన లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ మాట్లాడుతూ… ఏలూరు బిసి డిక్లరేషన్ సభలు సీఎం జగన్ బీసీలను భారతీయ సంస్కృతి గా అభివర్ణించారు అని గుర్తు చేశారు. బీసీల భారతీయ సంస్కృతి కళతో పాటు, బీసీలను సమాజానికి వెన్నుముక మార్చాలని ని సీఎం ఆశయమని తెలిపారు. నేతన్న నేస్తం ద్వారా కరోనా కష్టకాలంలో చేనేత కుటుంబాలకు సీఎం జగన్ భరోసాను కల్పించారని చెప్పారు. ఈ సమావేశంలో MP డాక్టర్ సంజీవ్ కుమార్, MLC అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్ మోహన్ రావు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, నవరత్నాలు కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వరు ముసలయ్య, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.