ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: MP మిథున్ రెడ్డి


చిట్వేలి: ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలుగా పనిచేస్తున్నారని, లోక్ సభ ప్యానల్ స్పీకర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.

మంగళవారం చిట్వేలి ఎంపీడీవో సభా భవనంలో మండలం అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని మండల అభివృద్ధి శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్వేలి మండలం గృహ నిర్మాణంలో బాగా వెనకబడి ఉందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సమిష్టిగా కృషిచేసి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా అందించాలని అధికారులను ఆదేశించారు. చిట్వేలి కోడూరు ప్రధాన రహదారి, జూనియర్ కళాశాల మంజూరయ్యాయి. ఎల్లం రాజు చెరువుకు సోమశిల వెనుక జలాలు మళ్లింపు కార్యక్రమం ఊపందుకున్న ట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో ప్రజలు వినతిపత్రాలను MP,MLA లు ప్రజలు అందజేశారు. శ్రీదత్తగిరి నారాయణ తపోవనం ఆశ్రమ నిర్వాహకులు నారాయణమ్మ ఆశ్రమం సమస్యలపై వారికి వివరించారు.

చిట్వేలి యువత గుంజనేరు బ్రిడ్జి, క్రీడా మైదానం, ఎల్లమ్మరాజు చెరువు సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్
చెవు శ్రీనివాసులు రెడ్డి, ఎల్. వి మోహన్ రెడ్డి, రాజంపేట డి.ఎస్.పి శివ శంకర్ రెడ్డి, సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎమ్మార్వో జీవన్ చంద్రశేఖర్, ఎంపీడీవో నాగభూషణం, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.