46 దేవాలయాలు పునర్నిర్మాణం: మంత్రి వెల్లంపల్లి
గుంటూరు జిల్లా:( వినుకొండ) ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు మతపరమైన విమర్శలు చేయడం తగదని, రాష్ట్రంలో వివిధ సందర్భాలలో ఆయా ప్రభుత్వ హయాంలో కూల్చివేయడం 46 దేవాలయాలను పునర్నిర్మాణం చేపడుతున్నారని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
గుంటూరు జిల్లా వినుకొండ లో ఆదివారం జరిగిన పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రిపై బిజెపి, టిడిపి,జనసేన మత వ్యతిరేక ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. వినాయక చవితి పండగ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన సూచనలు పాటించి ఉందని తెలిపారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలకు న్యాయస్థానం కేంద్ర సూచనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు ఆలయాల్లో అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. చారిత్రక విశిష్టత కలిగిన వినుకొండ కొండ పై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి, కొండపై ఘాట్ రోడ్డు నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని, ఇందుకయ్యే ఖర్చు పై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యేలు, బల్ల బ్రహ్మనాయుడు, మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్. ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాధుప్రతాప్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అడ్డ గిరి ద్వారక వాసు పాల్గొన్నారు.