నగరాన్ని హరిత ‘అనంత’గా తీర్చిదిద్దుతాం…..
అనంతపూర్ కార్పొరేషన్: అనంతపురం నగరాన్ని’హరిత అనంత గా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని వ్యక్తులు పిలుపునిచ్చారు.
సోమవారం నగరంలోని సాయి నగర్ నాలుగో క్రాస్ లో మేయర్ మహమ్మద్ వసీం, ఎం.పీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. మొక్కలు నాటితే ఎదిగే చెట్లు గా నీడ తోపాటు ప్రాణవాయువుని అందిస్తాయి. కాలుష్యాన్ని తగ్గిస్తాయని అన్నారు. కరోన సమయంలో లో ఆక్సిజన్ ప్రాధాన్యతను అందరూ తెలియజెప్పింది.
అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేవలం నాటడమే కాదు, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వేట దేశవ్యాప్తంగా వాయు కాలుష్యంతో లక్షలమంది మృత్యువాత పడుతున్నారని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు పచ్చదనం పెంపొందించాలని తెలిపారు. నగరంలోని డివిజన్ లో కార్పొరేటర్లు, మున్సిపల్ యంత్రాంగం మొక్కల పెంపకాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో నగరపాలక సంస్థ కమిషనర్ PVVS మూర్తి, డిప్యూటీ మేయర్ లు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, కార్పోరేటర్లు బాలఆంజనేయులు, అనిల్ కుమార్, కమల్ భూషణ్, బాబా ఫక్రుద్దీన్,సైఫుల్లాబేగ్, తదితరులు పాల్గొన్నారు.