అర్చకులకు తీపికబురు తెలిపిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు తీపి కబురు అందించారు జగన్ ప్రభుత్వం. అర్చకుల జీతాలు ఏకంగా 25% పెంచుతున్నట్లు తెలిపారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి జగన్ సమగ్రంగా సమీక్షించారనీ… గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి సమీక్షించిన దాఖలాలు లేదని,
వంశపారం పర్యంగా అర్చకుల నియామకం ఉంటుందన్నారు.
రాబోయే రోజుల్లో దేవాదాయ శాఖ చేయాల్సిన అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు.
అర్చకులకు వంశపారపర్యంగా హక్కులు కల్పిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జివో ఇచ్చారని, అదనంగా 25 శాతం జీతం పెంపు నిర్ణయం తీసుకున్నారు. అర్చకులు ఇల్లు ఇచ్చే అంశం త్వరితగతిన ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. దేవాదాయ భూముల సర్వే చేసి ఆలయాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు