సిమ్లాకు బయలుదేరిన సీఎం జగన్

విజయవాడ: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గురువారం ఉదయం సిమ్లా పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడినుండి జగన్ గారు, ప్రత్యేక విమానంలో చండీగఢ్ కి వెళ్లి, అక్కడి నుండి సీఎం గారు సిమ్లాకు బయలుదేరారు.

సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు సీఎం జగన్ గారు చేరుకున్నారు. August 28న సీఎం జగన్- వైయస్ భారతిరెడ్డి ల 25వ పెళ్లిరోజు. దీంతో వివాహ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ నేపథ్యంలో ఐదు రోజుల పాటు సీఎం జగన్ గారు తన కుటుంబంతో గడపనున్నారు.

తమ వ్యక్తిగత అవసరాల కోసం సీఎం జగన్ గారు సిమ్లా,పర్యటనకు వెళ్లనున్నారు.

సీఎం గారితో పాటుగా తమ కుటుంబ సభ్యులు కూడా సిమ్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈపర్యటన ఏర్పాట్లను సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, తదితరులు పర్యవేక్షించారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker