రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, కళాశాలలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కఠిన ఆదేశాలు జారీ
COVID థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ,కళాశాలలు కఠినమైన సూచనలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు.
కరోనా సంక్రమణ నెమ్మదిగా పెరుగుతుంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై, రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పై దృష్టి సారించింది. విద్యార్థులు కరోనా బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలిపారు. ఆగస్టు 16వ తేదీన రాష్ట్రంలోని ప్రారంభమైన పాఠశాలలు, కళాశాల నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. విద్య, ఆరోగ్యం,కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష జరిగిన మంత్రి పలు సూచనలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 97% ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలిన ఏడు వేల 388 మంది చర్యలు తీసుకోవాలని, మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వందల మందికి ఒకేసారి వ్యాక్సిన్ వేసేందుకు ఎక్కడ ప్రతిపాదిస్తే అక్కడే వ్యాక్సిన్ ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలో విద్యార్థులు భౌతిక దూరం పాటించగలిగితే చాలావరకు అదుపు చేయొచ్చని మంత్రిగారు తెలిపారు. స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, డిగ్రీ ,ఇంజనీరింగ్ విద్యార్థులు సిబ్బందికి వ్యాక్సిన్, అందించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కోట్లు, 71 లక్షల, 61వేల 870 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 లక్షల 97 వేల 454 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 1311 మంది కోలుకున్నారు.