YS రాజశేఖర రెడ్డిని స్మరించుకున్న చిరంజీవి



సెప్టెంబర్ 2 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా మహానేత ను వైఎస్సార్ పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004,MAY నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్..

2009 లోను రెండోసారి అధికారంలోకి వచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్,108 అంబులెన్స్ సర్వీసులు,రూ.2కే కిలో బియ్యం,,ఫీజు రీయింబర్స్‌మెంట్, ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు సహా ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలా తన ప్రజారంజక పాలనతో ప్రత్యేక స్థానం సంపాదించారు. అప్పటి ముఖ్యమంత్రి (వైఎస్ఆర్) ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి.

తెలుగు రాష్టరాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖర రెడ్డిని నేడు వర్ధంతి సందర్బంగా పలువురు ప్రముఖులు స్మరించుకుంటున్నారు. తాజాగా ఆయనను మెగాస్టార్ చిరంజీవి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ‘దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ ప్రజా నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా..’ అంటూ చిరు ట్వీట్ చేశారు.