మీరు నడిపే వాహనాలపై ప్రెస్ లేదా పోలీస్ అనే ఇక్కడ పెట్టుకొని ప్రయాణిస్తున్నారా?

మీరు నడిపే వాహనాలపై ప్రెస్ లేదా పోలీస్ అనే ఇక్కడ పెట్టుకొని ప్రయాణిస్తున్నారా. మీరు నిజంగా చేసే వృత్తి వేసుకుంటే పర్వాలేదు. మీరు అదే వృత్తి చేయకుండా స్టిక్కర్ పెట్టుకున్నారో తస్మాత్ జాగ్రత్త. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విశాఖపట్నంలోని పోలీసులు ఇలాంటి నక్లిస్ టిక్కెట్ల పైన దృష్టి సారించారు.

విశాఖపట్నం  జిల్లాహనుమంతవాక  మద్దిలపాలెం జంక్షన్ లో శనివారం ఉదయం ఏడిసిపి ఆదినారాయణ, సీఐ షణ్ముఖ ఆధ్వర్యంలో ఏసీపీ కుమారస్వామి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. మద్దిలపాలెం లో నిర్వహించిన తనిఖీలలో ఊహకందని నకిలీ స్పీకర్ల తో వాహనదారులు పట్టుబడ్డారు. అయితే వీరిలో కొంతమంది పోలీసు స్టిక్కర్లు తొ దర్శనమిచ్చాయి. మరి కొంతమంది కార్ల పైన ఇలాంటి స్టిక్కర్లు తో చలామణి అయిపోతున్నారు జిల్లా సరిహద్దులు దాటి ఆర్టీవో బోర్డు పెట్టుకుంటూ కారులో షికారు చేస్తున్న  ఓ వ్యక్తిని పోలీసులు ప్రశ్నించి ఆర్టీవో బోర్డు తొలగించారు. అయితే వీరిలో కొంతమంది నిజమైన పోలీసులు జర్నలిస్టులు ఉండడంతో వారిని విడిచిపెట్టారు. 

కొంత మంది ప్రభుత్వ అధికారులు కార్లకు బోర్డులు పెట్టుకొని దర్జాగా తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇలా నకిలీ స్పీకర్లతో ప్రయాణించే వారి సంఖ్య పోలీసులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా ఉంది. దీంతో పోలీసులు ప్రజల్లో చైతన్యం  కల్పించేందుకు ఇలాంటి ప్రచారం కొనసాగుతాయని తెలిపారు. అయితే ఏ డిసిపి ఆదినారాయణ మాట్లాడుతూ ఇప్పటికే చాలా మంది నకిలీ స్పీకర్లతో  తిరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి నకిలీలు తొలగించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ అన్నారు. ఈ డ్రైవ్ లో నిజమైన ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు నాలుగు గంటల పాటు ఈ డ్రైవ్ నిర్వహించామన్నారు ఏడిపి ఆదినారాయణ.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker