TTD పాలక మండలి పై సర్కారు నిర్ణయం.ఏపీ బిజెపి ఫైర్… సభ్యుల సంఖ్య పెంచితే న్యాయపోరాటం.


టిటిడి పాలక మండలి ఈ విషయం లో సభ్యుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రభుత్వం. టిటిడి బోర్డు చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డి ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెన్యువల్ చేసింది.

మిగిలిన పాతిక మంది సభ్యుల ఎంపికలో రకరకాల కొలమానాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. సేవా భావం కలిగిన వారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే సీఎంతో భేటీ అవుతున్నారు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి 10 పది మందితో పాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అయితే వీరికి విధానపరమైన నిర్ణయాలు ఇలాంటి పాత్ర వుండదు. తెలంగాణ నుంచి 5 మందికి చోటు కల్పించనుంది జగన్ ప్రభుత్వం.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు నుంచి ఇద్దరు. కర్ణాటక నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. టిటిడి బోర్డు సభ్యుడిగా మల్లాడి కృష్ణారావు నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయాన్ని మల్లాడి మీడియాకు వెల్లడించారు. తనను టీటీడీ సభ్యునిగా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. తిరుమల వెంకన్న తో జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. జంబో పాలక మండలి నిర్ణయం సరికాదని సూచించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై సిఎం పునరాలోచన చేయాలని అన్నారు. పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.





స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker