AP TET: ఏపీ టెట్ రాసేవారికి ముఖ్య సూచనలు
ఏపీ టెట్ రాసేవారికి ముఖ్య సూచనలు
ఏపీ టెట్ కు మొత్తం 5.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ పరీక్షకు 4.50 లక్షలు మంది దరఖాస్తు చేస్తారని అధికారులు అంచనా వేశారు కానీ భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పరీక్షను టెట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కేంద్రాలను అధికారిక వెబ్సైట్లో ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ అండ్ క్యాప్షన్ కోడ్ తో లాగిన్ అయితే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
అభ్యర్థుల సంఖ్య భారీగా పెరగడం వల్ల కంప్యూటర్ కొరత ఉంది పక్క రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నారు. మొదటి ఆప్షన్ ఇచ్చే వారి ఇచ్చిన వారికి సొంత జిల్లాలో పరీక్ష రాసి అవకాశం ఉంటుంది ఆలస్యంగా ఇచ్చిన వారికి వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించి అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, బెంగళూరు, ఒడిస్సా, చెన్నైలో పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఏ ఉపాధ్యాయ కొలువులు సాధించాలన్న టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
ఆగస్ట్ 6 నుంచి 21 వరకు సిబిటి విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్ష రాసే అభ్యర్థులకు పేపర్ 1a, పేపర్ 2బి, పేపర్ 2a, పేపర్ 2b లో క్రింద పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 6 నుండి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రథమ కీ ని ఆగస్టు 31న, ఫైనల్ కీని సెప్టెంబర్ 12న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేస్తారు.
టెట్ అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40% మార్కులు రావాలి. డీఎస్సీ లో 20% వెయిటేజ్ మార్కులు ఇస్తారు.