Google Pixel Fold: గూగుల్ నుండి తొలి ఫోల్డబుల్ మొబైల్

Google Pixel fold: టెక్ దిగ్గజమైన గూగుల్ నుంచి రానున్న తొలి స్మార్ట్ ఫోన్ గురించి కొంతకాలంగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్నో అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ అనే పేరుతో వస్తుంది. ఈ మొబైల్ ప్రాజెక్టుకు ఫెలిక్స్ అనే కోడ్ నేమ్ ను పెట్టారు.

అయితే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కు సంబంధించిన డిస్ప్లే వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. సాంసంగ్ రూపొందించిన డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుందని తెలిపింది. అంతేకాకుండా మరిన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ సాంసంగ్ కు చెందిన ప్రైమరీ కవర్డ్ డిస్ప్లే తో వస్తుందని సమాచారం లీకైంది.

1840X 2028 పిక్సెల్స్ రేజల్యూషన్ తో ఉండే ప్రైమరీ డిస్ప్లే ఉంటుందని పేర్కొన్నారు. ప్రైమరీ డిస్ప్లే మాక్సిమం బ్రైట్ నెస్ 1200 నీట్స్ గా ఉంటుందని తెలుస్తోంది. ఫోల్డ్ చేసినప్పుడు కవర్ డిస్ప్లే కు 800 నీట్స్ వరకు మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది. రెండు డిస్ప్లే లు యొక్క రిఫ్రెష్ రేట్ 120 Hz నీ కలిగి ఉంటుంది.

google Pixel fold

గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ వెనక మూడు కెమెరాలు ఉంటాయి అని లీకుల ద్వారా తెలిసింది. Sony IMX787 మెయిన్ కెమెరా, sony IMX386 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరియు మరొక టెలి ఫోటో లెన్స్ ఉంటుందని లీక్ ల ద్వారా తెలిసింది. ఇన్నర్ ప్రైమరీ కెమెరా డిస్ప్లే కు Sony IMX355 కెమెరా ఉండవచ్చు అని సమాచారం.

కవర్ డిస్ప్లే కు S5K3J1 సెన్సార్ తో కూడిన సెల్ఫీ కెమెరా ఉంటుంది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ను పిక్సెల్ సిక్స్ సిరీస్ తో పాటు గత సంవత్సరమే గూగుల్ విడుదల చేస్తుందని పుకార్లు వినిపించాయి. అయితే రూపకల్పన పూర్తి కాకపోవడంతో గూగుల్ మరి కొంతకాలం ఆలస్యం చేసింది.

డిజైన్ లో స్వల్ప మార్పులు కూడా ఆలస్యం అయ్యేందుకు కారణం అయ్యాయి. కాగా 2023 సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ఈ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే అవకాశం ఉందని అంచనా. చైనాలోని ఫాక్స్ కాన్ యూనిట్లో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి జరుగుతుందని సమాచారం.

అయితే ఇంతవరకు ఈ ఫోన్ డబ్బులు స్మార్ట్ ఫోన్ కొ చెందిన ఏ వివరాలు అధికారకంగా గూగుల్ వెల్లడి పరచలేదు. గూగుల్ పిక్సెల్ సెవెన్ సిరీస్ లాంచ్ సందర్భంగా ఈ ఫోల్డర్ స్మార్ట్ ఫోన్ గురించి ప్రస్తావించలేదు. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలోని ఈ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ గురించి, గూగుల్ ప్రకటించే అవకాశం ఉంది.