jio 5G smart phone: ప్రస్తుతం భారతదేశం కూడా టెక్నాలజీ పరంగా చాలా ముందుగానే ఉంది. ఈ విషయంలో చెప్పడంలో ఎలాంటి సందేహం పడనవసరం లేదు. ఇప్పుడు తాజాగా భారత దేశంలో 5g నెట్వర్క్ సేవలు ప్రారంభం కానుంది. అక్టోబర్ 1 తేదీ నుండి 5g సేవలు ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ తాజాగా ప్రకటించడం జరిగింది. 5g నెట్వర్క్ సంబంధించి వేలం ముగియడం ఆగింది. ఎయిర్టెల్ ,జియో ,వోడాఫోన్, ఎయిర్టెల్ ,రిలయన్స్, ఐడియా తదితర నెట్వర్క్లు ఇప్పటికే పోటీపడ్డాయి. అయితే అక్టోబర్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5g నెట్వర్క్ సేవలను ప్రారంభించినట్లు సమాచారం.
ఇక టెలికాం దిగ్గజ మార్కెట్ సంస్థలలో5g స్మార్ట్ ఫోన్ తో మరొక సంచలనానికి దారి తీయడానికి సిద్ధమైంది వాటి గురించి తెలుసుకుందాం.అందరికీ అందుబాటులో ఉండేవిధంగా 5g స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది రిలయన్స్ జియో సంస్థ.
ఇప్పటికే 4g మొబైల్స్ ను తీసుకురావడంలో చాలా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు 5g ఫోన్ పైన దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. దాదాపుగా ఈ స్మార్ట్ ఫోన్ ధరకు వస్తే ₹8,000 మరియు 12,000₹వేల రూపాయల ధరలలో 5g మొబైల్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
ఇందుకోసం ఇప్పటికే తైవాన్, కొరియా, చైనా వంటి కంపెనీలతో కూడా పలు చర్చలు జరిపినట్లు సమాచారం. భారతదేశంలో అందరికీ 5g నెట్వర్క్ అందుబాటులో ఉండేలా చేస్తుంది. పెద్ద కంపెనీలు 5g మొబైల్స్ తయారు చేయడంలో ముందుగా ఉంది.
100 మిలియన్ల 2g ఫీచర్ ఫోన్ వినియోగదారులు 4g నెట్వర్క్ గూగుల్ తో కలిసి అభివృద్ధి చేసిన జియో ఫోన్ నెక్స్ట్ ఫోన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు తాజాగా 5g మొబైల్స్ విషయంలో కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయంటూ సమాచారం. ఆకర్షణీయంగా ఉండే విధంగా మొబైల్ ని విడుదల చేయనున్నారు.
మొత్తానికి రిలయన్స్ జియో 5g మొబైల్స్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాయని సమాచారం. మార్కెట్లోకి ఇవి త్వరలోనే విడుదల కానున్నాయని సమాచారం. రానున్న రోజులలో 5g రీఛార్జి ప్లాన్లు కూడా చౌక ధరలకే ఉంటాయని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
మరి రిలయన్స్ జియో విడుదల అవ్వబోతున్న 5g మొబైల్ ఎలాంటి ఫ్యూచర్లు కస్టమర్లకు ఇస్తుందో తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో 4g కూడా కనుమరుగయ్యేఅవకాశాలు ఉన్నాయి.