మహిళ సైనికాధికారులకు నోటీసు


న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన 72 మంది మహిళా అధికారులు రక్షణ మంత్రిత్వశాఖకు లీగల్ నోటీసు పంపారు.
నోటీసులో మహిళా అధికారులు సైన్యం లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. మహిళ తరుపు న్యాయవాది సుధాంశు మేజర్ పాండే మంత్రిత్వశాఖకు నోటీసు పంపారు. శాశ్వత కమిషన్ కోసం ఆదేశాలు పాటించాలని కోరినట్లు పాండే తెలిపారు. 72 మంది మహిళా అధికారులకు నోటీసులు పంపినట్లు చెప్పారు.


రక్షణ కార్యదర్శి, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ తో సహా అధికారులకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.
ఈ సంవత్సరంలో మార్చి 25న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ అమలు కోరుతున్నారు.


గతంలో సుప్రీంకోర్టు మహిళా అధికారులను బ్యాచ్ లోని పురుష అధికారులకు నిర్దేశించిన బెంచ్ మార్కులతో పోల్చ రాదని రక్షణ మంత్రిత్వ శాఖ, అధికారులకు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 5న జారీ చేసిన ఉత్తర్వుల్లో 60 శాతం మార్కులు సాధించి.. ఐదు మార్కులతో అనర్హులుగా తేలిన మహిళా అధికారులు అందరికీ శాశ్వత కమిషన్ అమలు చేయాలని సెలక్షన్ బోర్డ్ కు కోర్టు సూచించింది.
ఉత్తర్వులు అమలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ రెండు నెలలపాటు ఇచ్చింది.