Kamal Haasan: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్.
మళ్లీ సినిమాలను వరుసలో పెట్టిన లోకనాయకుడు: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత కమర్షియల్ గా సక్సెస్ ను సాధించాడు. యంగ్ హీరోలు 100 కోట్ల వసూళ్లు రాబడుతూ ఉంటే యూనివర్సల్ స్టార్ హీరో అయినా కమల్ హాసన్ మినిమం వసూళ్లు లేక డిలా పడిపోయాడు. అలాంటి సమయంలో లోకనాయకుడు సినిమాలు పూర్తిగా వదిలేసి రాజకీయాలకు పరిమితమయ్యాడని వార్తలు కూడా ప్రచారం చేయడం అప్పట్లో జరిగింది.
కమల్ హాసన్ సినిమాల నుంచి తప్పుకున్నాడు అని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. విక్రమ్ సినిమా మంచి విజయాన్ని సాధించిన కారణంగా కమల్ హాసన్ ఆగిపోయిన రెండు సినిమాలను మళ్లీ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాని మొదలు పెట్టేందుకు కమల్ హాసన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. శంకర్ కూడా ఇండియా 2 సినిమా పట్ల మళ్లీ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాల పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అభిమానులు మాత్రం ఇండియన్ 2 తో పాటు గతంలో ఆగిపోయిన శభాష్ నాయుడు సినిమాను కూడా మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మలయాళ దర్శకుడు అయిన మహేష్ నారాయణన్ కూడా కమలహాసన్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నడట. ఎడిటర్ గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిన మహేష్ నారాయణన్ కు చాలాకాలం నుంచి కమల్ హాసన్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధం తోనే మహేష్ నారాయణన్ కమల్ హాసన్ కు కదా చెప్పారట. మహేష్ నారాయణన్ చెప్పిన కథ కమల్ హాసన్ కు బాగా నచ్చడంతో ఆయన కూడా ఓకే అన్నాడట.
శభాష్ నాయుడు మరియు ఇండియన్ 2 సినిమాలను ఇదే ఏడాదిలో ముంగిస్తారా లేదా అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న కమల్ హాసన్ సినిమా మాత్రం ఖచ్చితంగా వచ్చే ఏడాదిలో ప్రారంభం కావచ్చని అభిమానులు అంటున్నారు. మహేష్ నారాయణ టేకాఫ్ అని సినిమా తీసి మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఈ సినిమాలలో మాత్రమే కాకుండా లోకనాయకుడు మల్టీస్టారర్ సినిమాలకు కూడా కమిట్ అయ్యాడని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు విక్రమ్ సినిమా విజయంతో కమల్ హాసన్ వరుస సినిమాలు సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు. విక్రమ్ సినిమాకి దర్శకత్వం చేసిన లోకేష్ కనగ రాజ్ తో కూడా మరోసారి జతకట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజమో త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.