Karthika Masam: కార్తీక మాసం విశిష్టతకార్తీక మాసం ప్రారంభం.

కార్తీక మాసం: కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసం ప్రారంభం:
శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఒక్కటే. ఈ కార్తీకమాసం ప్రారంభం అయింది. మామూలుగా కార్తీకమాసం దీపావళి పండగ అయిపోయిన మరుసటి రోజు కార్తీక మాసం వస్తుంది. అయితే ఈసారి కార్తీకమాసంలో కొంత మార్పులు జరిగాయి.

దీపావళి పండుగను గ్రహణం కారణంగా ఒకరోజు ముందు జరుపుకున్నాము. మరుసటి రోజు గ్రహణం ఉన్నందున, దీపావళి అయిపోయిన మరుసటి రోజు కాకుండా, ఆ మరుసటి రోజు జరుపుకుంటున్నారు. 25న అమావాస్య గ్రహణం కారణంగానే ఇలా జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేశారు. 25వ తేదీన పాడ్యమి సాయంత్రం నుంచి ఉంది కానీ, ఉదయం పూట పాడ్యమే గడియలు ఉంటేనే కార్తీకమాసాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అందువలన బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది.

Karthika Masam Temple in Sraisailam

కార్తీక మాసం ప్రాముఖ్యత:

అన్ని మాసాల కంటే కార్తీక మాసానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. మహావిష్ణువుకు సమానంగా ఉండే దేవుడు లేడు. వేదాలకు సమానమైన శాస్త్రం లేదు. అలాగే గంగకు సమానమైన తీర్థం మరొకటి లేదని స్పంద పురాణాల నుండి చెప్పబడింది. అందువలన కార్తీకమాసానికి సమానమైన మాసం లేదని, అందువలన ఈ కార్తీకమాసానికి అంతటి ప్రాముఖ్యత. అంతేకాకుండా కార్తీక మాసం శివునికి కూడా చాలా ప్రీతికరమైనది. అందువలనే కార్తీకమాసంలో శివ భక్తులు శివునిమాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు చేయడం ద్వారా అనుకున్నవి నెరవేరుతాయి. పాపాలు పరిహారం అయ్యి, పుణ్యం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం.

కార్తీక మాసంలో పూజించే దేవుళ్ళు:

కార్తీక మాసాన్ని శివునికి విష్ణువుకి ఎంతో ఇష్టమైనదిగా చెబుతుంటారు. అందువలన ఈ మాసంలో శివుని, విష్ణువుని ఎక్కువగా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివుడు విష్ణువును కలిపి శివకేశవులు అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం కార్తీకమాసం అక్టోబర్ 26వ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ 23వ తేదీ వరకు ఉంటుంది. ఈ కార్తీకమాసం నెల రోజులు శివ భక్తులు, వైష్ణవ భక్తులు మాలలు ధరించి, నియమనిష్ఠలతో స్వామివారిని పూజిస్తారు. అంతేకాకుండా శివకేశవుల క్షేత్రాలలో, ఆలయాలలో శివకేశవుల నామసూరణతో మార్గరవుతూ ఉంటాయి. నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి.

కార్తీక మాసంలో అనుసరించాల్సిన నియమాలు: