మారుతి సుజుకి బ్రేజా CNG కొత్త వెర్షన్ మార్కెట్లోకి విడుదల

భారతదేశంలో ప్యాసింజర్స్ కు అనుగుణంగా ఉండే కార్ల మార్కెట్లో “కాంపాక్ట్ ఎస్.యూ.వీ, విభాగం కీలకమైన పోటీ కలిగి ఉంది. ఈ కీలకమైన కారు మార్కెట్లో స్థిరంగా ఉండాలంటే, ఎప్పటికప్పుడు మార్కెట్లో ఉండే ట్రెండుకు అనుగుణంగా సదరు కారును అప్‌గ్రేడ్ చేయడం ఎంతో ముఖ్యం. కార్ కంపెనీ ఇతర కంపెనీలతో సమానంగా తమ కార్లను అందించలేనప్పుడు, ఆ కంపెనీ మార్కెట్లో పరాజయం అయ్యే అవకాశం ఉండకపోదు. అందుకే భారతదేశంలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న మారుతి సుజుకి, ఈ సిద్ధాంతాన్ని పాటిస్తుంది.

మనం గమనించినట్లయితే, మారుతి సుజుకి ఏడాదిలో తన యొక్క శైలిలో అనేక కారులను అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. బాలేనో, ఎర్టిగా,  ఎక్సెఎల్ 6, మొదలగు వాటిని మారుతి సుజుకి కంపెనీ  అప్‌గ్రేడ్ చేసింది. డ్రైవర్ సీటు తో కలిపి ఐదు సీట్లను వీరు కల్పించారు. దీనిలో 360° కెమెరాను  అమర్చారు.

వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని మరియు 6 Air బ్యాగ్స్ ను అందించారు.

ఎయిర్ బ్యాగులను రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి డ్రైవర్ ఎయిర్ బాగ్, రెండు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. SUV పద్ధతులను రూపొందించారు. పెట్రోల్ మరియు CNG ఇంజన్లు కలవు. విలువ 7.9 లక్షలు నుండి 13.7లక్షలు ఉంటుందని అంచనా. నాలుగు సిఎంజి సిలిండర్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ రానుంది. CNG మైలేజ్ 26KM/KG, PETROL మైలేజ్ 17-20 KM/Liter.

కంపెనీ నివేదిక ప్రకారం ఏప్రిల్ లేదా మే నెలలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. పెట్రోల్ ఇంజన్లు 4-స్పీడు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ సౌకర్యం లభిస్తుంది. 5- స్పీడ్ టార్కు మ్యాన్వల్ గేర్ బాక్స్ ను అందించారు. CNG లో  మాత్రము మ్యాన్వల్ గేర్ బాక్స్ కలదు.