Maruti Suzuki Swift CNG: మారుతి నుండి తాజాగా భారత మార్కెట్లో కి వచ్చిన సరికొత్త CNG మోడల్ స్విఫ్ట్ CNG ఇప్పుడు డీలర్ల వద్ద కు చేరుకోవటం ప్రారంభించాయి. మారుతి సుజుకి కంపెనీ తమ స్విఫ్ట్ CNG హ్యచ్ బ్యాక్ ను ఆగస్ట్ 12వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా ఇప్పుడు ఈ CNG కార్లను కస్టమర్లకు డెలివరీ చేసేందుకు మారుతి సుజుకి తన డీలర్లకు స్టాక్ యార్డులకు పంపిణీ మొదలుపెట్టింది.
దీనిని బట్టి చూస్తుంటే త్వరలోనే ఇది కస్టమర్లకు డెలివరీ అవుతుందని తెలుస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ CNG కారును 2 వెరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్విఫ్ట్ CNG VXI వేరియంట్ ధర ₹7.77 లక్షలు ఉంటుంది. అంతేకాకుండా స్విఫ్ట్ CNG ZXI వేరియంట్ ధర ₹8.45 లక్షలు ఉంటుంది.
మారుతి సుజుకి అందిస్తున్న ఇతర CNG మోడల్స్ కార్లతో పోలిస్తే స్విఫ్ట్ CNG ఖరీదు ఎక్కువగానే ఉంది. స్విఫ్ట్ CNG హ్యచ్ బ్యాక్ ను స్టాండర్డ్ మోడల్ నుండి నేరుగా ఉంచేందుకు కంపెనీ వేటిపై S- CNG బ్యాడ్జిని ఉంచింది. అలాగే ఈ కార్లకు కుడివైపున CNG ఫిల్లింగ్ క్యాప్ ఉంది.
ఈ రెండు మార్పులు కాకుండా ఈ CNG వేరియంట్ స్టాండర్డ్ స్విఫ్ట్ హ్యచ్ బ్యాక్ మాదిరిగానే ఉంటుంది. ఈ CNG వేరియంట్ స్విఫ్ట్ కారులో CNG ట్యాంక్ బూట్ స్పేస్ లో ఉంది. ఫలితంగా స్టాండర్డ్ మోడల్ కన్నా ఈ CNG మాటల్లో బూట్ స్పేస్ తక్కువగా ఉంది. ఇతర సీఎన్జీ కార్లలో మాదిరిగా కాకుండా మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి కారులో సిఎన్జి ట్యాంక్ తక్కువగా ఉంది.
ఇది హ్యచ్ బ్యాక్ యొక్క గురుత్వాకర్షణ కేంద్రాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కారులో స్పేర్ వీల్ ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం దానిని సిఎన్జి ట్యాంక్ ముందు భాగంలో ఉంచుకోవాలి. ఈ సీఎన్జీ ట్యాంక్ తుప్పు పట్టకుండా ఉండటానికి సేయిన్ లెస్ స్టీల్ పైపులను ఉపయోగించారు. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన వైరింగ్ జిన్ ను ఉపయోగించారు.
సిఎన్జిని ఫుల్ చేస్తున్నప్పుడు ఇంజన్ స్టార్ట్ కాకుండా ఉండటానికి కంపెనీ ఒక మైక్రోస్ స్విచ్లు ఈ కారులో ఇన్స్టాల్ చేసింది. మారుతి సుజుకి అందిస్తున్న సిఎన్జి కార్లన్నీ కూడా నాణ్యమైన సిఎన్జి కన్వర్షన్ కిట్టు కూడా ఉంది. కంపెనీ టెక్నాలజీ S-CNG అని పిలుస్తారు. మారుతి సుజుకి యొక్క అన్ని సిఎన్జి మోడళ్లు కూడా డ్యూయల్ ఇండిపెండెంట్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్ లు, మంచి పనితీరు, మైలేజ్ కోసం వాంఛనీయ వాయు ఇందాక నిష్పత్తిని అందించే ఇంటెలిజెంట్ సిస్టం కూడా ఉంది.
Read more: మీకు CNG కారు ఉందా అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి యొక్క ఇంజన్, ఇందులో 1.2 లీటర్ కె సిరీస్ జెట్ మరియు డిఎల్వీటి ఇంజన్ సిఎన్జి మోడ్ లో దీని యొక్క గరిష్ట శక్తి 76.5 bhp, దీని యొక్క గరిష్ట టార్క్ 98.5 nm ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే వస్తుంది. అంతేకాకుండా ఇది పెట్రోల్ ఇంజన్ మోడల్ లో దీని యొక్క గరిష్ట శక్తి 98bhp, దీని యొక్క గరిష్ట టార్క్ 113nm నువ్వు ఉత్పత్తి చేస్తుంది.
సీఎన్జీ ఇంధనంలో ఇది కేజీకి 30.90 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేర్షన్ లో స్విఫ్ట్ లీటరుకు 23.20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి మోడల్ లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ తో కూడిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, పవర్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్లు, హైట్ అడ్జస్ట్మెంట్ డ్రైవింగ్ సీట్, అల్లాయ్ వీల్స్, LED డే టైం రన్నింగ్ లైట్లతో కలిగిన LED ఎగ్జాంపుల్ వంటి మరెన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి.
భద్రత విషయానికి వస్తే, రెండు ఎయిర్ బ్యాగులు, EBD తో కూడిన ABS వంటి స్టాండర్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆసక్తిగల కస్టమర్లు సిఎన్జి షిఫ్ట్ మోడల్ మారుతి సుజుకి అధికారిక వెబ్సైట్ నుండి లేదా డీలర్ షిప్ నుండి కూడా బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకి కంపెనీ ముందుగా డెలివరీ చేస్తుంది.
మారుతి సుజుకి తన కొత్త స్విఫ్ట్ CNG కోసం ఒక ప్రత్యేకమైన నెలవారి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కూడా అందిస్తుంది. కొత్త స్విఫ్ట్ సిఎన్జి కోసం అన్ని కలిపి ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ధర ₹16,499 నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ప్రతినెల వినియోగదారులపై మొత్తాన్ని చెల్లించడం ద్వారా స్విఫ్ట్ CNG కార్ కొంతకాలం పాటు అద్దెకు తీసుకోవచ్చు.