New Car Offer: కారు కొనే వారికి శుభవార్త! జూలైలో ఉండే ఆఫర్లు ఇవే

కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త, 70,000 రూపాయలను ఆదా చేసుకునే అవకాశం వచ్చింది.మీరు హోండా కార్ కొనాలి అనుకుంటే మీకు శుభవార్త. అనేక కార్ కంపెనీలు వాటి కార్లపై ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు జులై నెలలో కొనాలనుకునే వారికి మాత్రమే వర్తిస్తాయి.

మారుతి సుజుకి నుంచి ఈ నెలలో కార్లపై ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్లను కల్పించింది. మారుతి సుజుకి నుండి ఎర్టిగా మోడల్, కొత్తగా వచ్చిన బ్రెజ్జా  ఇందుకు ఉదాహరణలుగా ఉన్నాయి. సుజుకి ఆల్టో కారుపై ఏకంగా 29 వేలు తగ్గింపు ఉంది. 

సుజుకి ఈకో మోడల్ పై ఏకంగా 22,500 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. సెలేరియో మోడల్ కారు పై 54,000,వేగనార్ మోడల్ కారు పై 44,000, స్విఫ్ట్ మోడల్ కారు పై 29,000 డిజైర్ మోడల్ కారు పై 17,500 వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు.

హోండా కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ల గురించి చూద్దాం. హోండా 5th జనరేషన్ కారు పై 27,396 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. డబ్ల్యూఆర్ వీ మోడల్ కారు పై 27,000, హోండా జాజ్ కారుపై 25,000 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. హోండా అమేజ్ మోడల్ పై 8 వేల వరకు ఆదా చేసుకోవచ్చు హోండా సిటీ 4th జనరేషన్ కారపై ఐదు వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

అదేవిధంగా టాటా మోటార్స్ యొక్క డిస్కౌంట్ ఆఫర్లలో 70,000 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. టాటా హారియల్ కారుపై 70 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. టాటా సఫారీ కారుపై 40 వేల వరకు ఆదా  చేసుకోవచ్చు. టాటా నెక్సన్ కారు పై 15 వేలు ఆదా చేసుకోవచ్చు.టాటా టిగోర్ కారు పై ఏకంగా 33 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. టాటా టియాగో కారు పై 28 వేల,టాటా అల్ట్రోజ్ కారు పై 10 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇందులో కార్లపై డిస్కౌంట్ లేదా తగ్గింపు అనేక పలు రకాలు ఉన్నాయి. ఇందులో క్యాష్, కార్పోరేట్ ఎక్స్చేంజ్ బోనస్, లాయాల్టీ బోనస్, వంటి అనేక డిస్కౌంట్లను అందిస్తున్నారు.