NTR: ట్విట్టర్లో తెగ వైరల్ అవుతున్న RRR వీడియో క్లిప్పింగ్
ఇండియన్ ట్విట్టర్ రికార్డ్స్ అన్ని భయపడే విధంగా 24 గంటల్లో 8.6M. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అర్ అర్ అర్. ఈ మూవీకి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల తర్వాత డిజిటల్ లో కూడా అల్టిమేట్ వ్యువర్ షిప్ తో దూసుకు పోతుండగా వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ నుండి విపరీతమైన అప్లాజ్ ను సినిమా సొంతం చేసుకుంటూ ఉండగా రీసెంట్గా ఇండియన్ ట్విట్టర్ రికార్డులను తిరగరాసింది.
ఒక ఫారినర్ సినిమాను చూసిన తర్వాత 29 మార్వెల్ మూవీస్ అన్నీ చూశాను కానీ ఇలాంటి సీన్ ఎక్కడ చూడలేదు అంటూ ఆర్ ఆర్ అర్ ప్రీ ఇంటర్వెల్ ఎన్టీఆర్ సీన్ నీ ట్విట్టర్ లో పెట్టగా ఆ వీడియో కి వరల్డ్ వైడ్ గా విపరీతమైన రీచ్ సొంతం అయ్యింది.
అది ఏ రేంజ్ లో అంటే ఇండియన్ ట్విట్టర్ మూవీ రిలేటెడ్ వీడియోలలో ఎవ్వరి ఊహలకు కూడా అందని రేంజ్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. 24 గంటల్లో ఏకంగా 8.6 మిలియన్ న్యూస్ ఈ వీడియోకి సొంతం అవ్వగా ఒక నార్మల్ ట్విట్టర్ అకౌంట్ కి ఇలాంటి రీచ్ సొంతం అవడం ఊహకందని సంచలనం అనే చెప్పాలి. ఇలాంటి రికార్డ్ ఫ్యూచర్ లో కూడా బ్రేక్ అవ్వడం కష్టమే అని చెప్పాలి.