OLA ELECTRIC CAR: ఆగస్టు 15న OLA నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ కారు రాబోతుంది
OLA CAR: ఆగస్టు 15న OLA నుంచి కొత్తగా ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. కొత్తగా ఉత్పత్తిపై ప్రకటన పట్ల ఉత్సాహంగా ఉన్న ఓలా సీఈవో భవిష్ అగర్వాల్. భవిష్ అగర్వాల్ భవిష్యత్తులో భారీ ప్రణాళికను కూడా చాటుతామని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో ఇప్పటికే భారత మార్కెట్లో రికార్డులను సృష్టిస్తుంది.
ఓలా ఎలక్ట్రిక్ మరోక కొత్త ఉత్పత్తిని ఆగస్టు 15న ప్రజలకు పరిచయం చేయిస్తుంది. ఈ విషయాన్ని ఓలా సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలపడం జరిగింది. ఇది 2021 ఆగస్టు 15న ఓలా ఎస్ 1 ప్రో అనే పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది మనకు తెలుసు.
అదేవిధంగా సరిగ్గా సంవత్సరం తర్వాత అదే రోజున మరొక ఉత్పత్తిని ప్రజల ముందుకు తీసుకొనిస్తుంది. ఓలా ఒక ఎలక్ట్రిక్ కారు ఆకారం గల వాహనాన్ని తీసుకురానట్లు టీజర్ ని ఇస్తుంది.
ఇది ఆగస్టు 15న కొత్త ఉత్పత్తి గురించి ఎంతో ఉత్సాహంగా ప్రకటిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద ప్రణాళికను వంటి అనేక విషయాలను అదే రోజు ప్రజలతో పంచుకుంటుంది.
అని ఓలా సీఈవో అయిన బావిసాగర్వాల్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సంస్థ ఆగస్టు 15న కొత్త ఉత్పత్తిని ఆవిష్కరిస్తాము అని చెప్పడమే గాని అది కారా లేదా మరోక వాహనం అనే విషయం మాత్రం అధికారకంగా తెలపలేదు.
భారత కేంద్రం ప్రకటించిన పి ఎల్ ఐ పథకం కింద బ్యాటరీల తయారీపై ప్రోత్సాహాకాలకు ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఇప్పటికీ ఎంపికయింది.