Ola electric car: ఈ కారు ఇంత రేటా

Ola electric car: ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ టూవీలర్ కంపెనీగా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్. ఇటీవల ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో కూడా తన సత్తా ఏంటో చూపేందుకు సిద్ధంగా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఎప్పుడైతే మొట్టమొదటి ఎలక్ట్రికల్ టీజర్ విడుదల చేసింది. ఈ ఇటీజర్ లో రాబోతున్న ఓలా ఎలక్ట్రిక్ కార్ గురించి అనేక విషయాలను తెలిసే విధంగా ఉంది.

అయితే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు లాగా ఓలా ఎలక్ట్రిక్ కార్ చౌక ధర ఏమి ఉండదు. పోలా ఎలక్ట్రికల్ ప్రీమియం ఎలక్ట్రికల్ విభాగంలో విడుదల చేయబోతున్నామని కంపెనీ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇండియా 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ రాబోయే ఎలక్ట్రిక్ కార్ కు సంబంధించిన మరెన్నో కొత్త టీజర్లను విడుదల చేసింది.

మాట్లాడుతూ ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రీమియం సెగ్మెంట్లో ఈ కారును విడుదల చేయబోతున్నామని వెల్లడిపరిచారు. ఓలా ఎలక్ట్రిక్ కారు ధర సుమారు 50 లక్షలు వరకు ఉంటుందని ఓలా కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.

మరికొన్ని నెలల్లోనే ప్రీమియం ఎలక్ట్రికల్ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ చెప్పారు. ఒక నివేదిక ప్రకారం ఓల ఎలక్ట్రిక్ కంపెనీ తమ మొట్టమొదటి ఎలక్ట్రికల్ 2024లో విడుదల చేయడానికి చూస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ కార్ కోసం ఎదురు చూస్తున్నా వారికి దీని ధర షాకింగ్ గానే ఉంటుంది.

Ola electric car

కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మాత్రం ఈ ఎలక్ట్రిక్ కారు కోసం అధిక డిమాండ్ ను ఆశిస్తుంది. అంతేకాకుండా మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈ ప్రీమియం ఎలక్ట్రికల్ తో పాటు బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లపై కూడా దృష్టి సాధిస్తుందని కంపెనీ సీఈవో భవిష్య అగర్వాల్ తెలిపారు.

కానీ ఇది ఎప్పుడు వస్తుందనే విషయం మాత్రం భవిష్ అగర్వాల్ తెలపలేదు. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లో లాంచ్ చేసిన సందర్భంగా భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ తీసుకురాబోతున్న ఓలా ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో విడుదల చేసిన రెండు మూడేళ్లలో దాని ఉత్పత్తిని 1 మిలియన్ యూనిట్లకు చేరుకోవాలని లక్ష్యం ఉంది అని తెలిపారు.

ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో విడుదల కానున్న ఓలా ఎలక్ట్రిక్ కార్ దాని యొక్క ధర కు తగినట్లుగానే అనేక ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో అందించబోయే ఫీచర్ల గురించి ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ భవిష్ అగర్వాల్ మాత్రం ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ ను గురించి తెలిపారు.

పోలా ఎలక్ట్రిక్ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో లభిస్తున్న ఇతర కార్ల రేంజ్ కంటే ఇది చాలా ఎక్కువ రేంజ్ ను కలిగి ఉంది. పోలా ఎలక్ట్రిక్ కార్ ఎక్కువ రేంజ్ ను అందించే బ్యాటరీనే కాకుండా అత్యంత చురుకైన ఎలక్ట్రిక్ మోటర్ ను కూడా కలిగి ఉంటుంది.

కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం నాలుగు సెకండ్ల లోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకు ఉంటుంది అని తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో టీజర్ రూపంలో ఒక్కొక్కటిగా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్మడు పోతున్న, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సన్ ఇవి మొదటి స్థానంలో ఉంది. ఈ కంపెనీ ఇటీవల ఇందులో ప్రవేశపెట్టిన లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారుగా 437 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి కేవలం 9 సెకండ్ల కంటే తక్కువ సమయం పడుతుంది. పూల నుండి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ టాటా నెక్సన్ ఏవి కన్నా అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుందని కంపెనీ వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన కంపెనీ గత కొన్ని వారాలుగా విడుదల చేస్తూ వచ్చిన టీజర్ ల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు బాడీ స్టైల్ కలిగి ఉంటుంది. ఇంకా ముందు భాగం వైపు సెడాన్ మాదిరిగా పొడవాటి బానట్ ను కలిగి ఉంటుంది. దీని వెనక వైపు వాలుగా ఉండే రూపం కలిగి ఉంటుంది.

ఈ వోల ఎలక్ట్రిక్ కార్ వెనుక భాగంలోని రూఫ్ బూటుతో విలీనమైనట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫ్రెంట్ ప్రొఫైల్ చాలా షార్ప్ గా, స్పోర్టీ గా కనిపిస్తుంది. ఇంకా ఈ టీజర్ లో కారు ముందు భాగంలో ఎల్ఈడి లైట్లు ఆ రెండిటినీ కలుపుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఎల్ఇడి డే టైం రన్నింగ్ లైట్స్ వెనుక భాగంలో టెయిల్ లైట్, ఎల్ఇడి లైట్ బారు వంటి డిజైన్ హైలెట్స్ కూడా వెళ్లడయ్యాయి. అంతేకాకుండా టెస్లా ఎలక్ట్రిక్ కార్ మాదిరిగానే ఓలా ఎలక్ట్రిక్ కారు కూడా పాప్ అవుట్ డోర్ హ్యాండిల్స్, పారదర్శక సన్ రూపం కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఈ కారులో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

Ola electric car