Redmi 11 Prime 5G: 6 న విడుదల కానున్న కొత్త ఫోన్!

Redmi 11 prime 5G: రేడ్మి 11 ప్రైమ్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ సెప్టెంబర్ నెలలో 6వ తేదీన ఈ ఫోన్ ను లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని షావోమి సబ్ బ్రాండ్ అయినటువంటి రిడ్మి అధికారికంగా వెల్లడిపరిచింది. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు, 5000mah బ్యాటరీ, 5జి కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్ తో ఈ ఫోన్ రానుంది.

దీనిలో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తో వస్తుంది. రెడ్మీ 11ప్రైమ్ 5జీ  సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రెడ్మీ భారతదేశానికి ప్రకటించింది. కంపెనీ వెబ్సైట్ mi.com ఈ మొబైల్ కోసం మైక్రో సైట్లను కూడా క్రియేట్ చేసింది. దీని ద్వారా మరికొన్ని నోటిఫికేషన్ టీజ్ చేస్తుంది.

Redmi 5జి ఫోన్ ఇందులో మీడియా టెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్ తో రెడ్మీ 11 ప్రైమ్ 5జి మొబైల్ లో ఉంది. డ్యూయల్ సింగ్ సెటప్ తో 5 జీకి ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా డిస్ప్లేపై రియల్ డ్రాప్ నాచ్ లాగా ఉంటుందని కంపెనీ విడుదల చేసిన ఫోటోలలో తెలుస్తుంది. వెనక రెండు కెమెరాల సెటప్ ఉంది. ఈ ఫోన్ వెనక ప్యానెల్ టెక్స్చర్ డిజైన్ ను కూడా కలిగి ఉంటుంది.

Redmi 11 Prime 5G

చైనాలో విడుదల చేసిన రెడ్మీ నోట్ 11 ఈ కి రీబ్రాండెడ్గా రెడ్మీ 11 ప్రైమ్ 5జీని తీసుకువస్తుంది. దీంతో మిగిలిన స్పెసిఫికేషన్ లు కూడా బయటకి వచ్చాయి. ఇందులో 6.58 అంగుళాల FULL HD+IPS LCD డిస్ప్లే ను కలిగి ఉంటుంది. దీనికి 90Hz రిఫ్రిష్ రేటు కూడా ఉంటుంది.

ఇందులో 18W ఫాస్ట్ చార్జర్ సపోర్టు, 5000 mah బ్యాటరీతో ఈ మొబైల్ రానుంది. వీడియో కాల్స్ మరియు సెల్ఫీల కోసం 5 MP ఫ్రంట్ కెమెరా తో ఈ మొబైల్ రానుంది. దీని ధర సుమారు 15,000 ఉంటుంది అని అంచనా. 

Redmi 11 Prime 5G More Details: