Sports News

Cricket:శ్రీలంక బౌలర్-దుష్మంత చమీరా గాయాలపాలు-టోర్నమెంట్ నుంచి అవుట్

క్రికెట్ ఆటకు సంబంధించి టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ అనేది ఆస్ట్రేలియా వేదికన జరుగుతుంది. దీనికి సంబంధించి టీమిండియా జట్టులో శారీరక గాయాల కారణంగా ఇద్దరూ కీలక బౌలర్లు తప్పుకున్నారు. టి20 ప్రపంచ కప్ కు సంబంధించి గాయాల బెడద వెంటాడుతుంది.

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో భారీ మార్పులు కారణం ఎవరంటే?

స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, టి20 స్పెషలిస్ట్ బౌలర్ దీపక్ చాహర్ టోర్నీ నుంచి వైదొలగారు. శ్రీలంక కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటికే లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ దిల్షాన్ మధు శంక గాయపడ్డారు. ఈ టోర్నమెంట్ మొత్తం నుంచి కూడా తప్పుకున్నారు. తాజాగా ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరా కూడా గాయపడ్డారు. యూఏఈ పై జరిగిన మ్యాచ్లో ఇతడు గాయాల పాలయ్యాడు.

చీలమండ గాయానికి గురయ్యాడు. తన బౌలింగ్ కోటను కూడా పూర్తి చేయలేకపోయాడు. యూఏఈ పై జరిగిన మ్యాచ్లో తన నాలుగవ ఓవర్ ఐదవ బంతిని వేయడానికి రన్నప్ తీసుకున్న సమయంలో కండరాలు పట్టేసాయి. దీంతో ఆ ఓవర్ ని పూర్తి చేయలేకపోయాడు. గ్రౌండ్ నుండి బయటికి వెళ్లిపోయారు. ఆ మిగిలిన ఒక బంతిని శనక వేశాడు. యూఏఈ మ్యాచ్లో శ్రీలంక ఇన్నింగ్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ అతనే. 3.5 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన ఘనత ఇతనికి చెందింది.

యూఏఈ కెప్టెన్ సిపి రిజ్వాన్, వికెట్ కీపర్ ఆర్యన్ లక్రా, మహమ్మద్ వసీం వికెట్లను పడగొట్టాడు దుష్మంత చమీరా. ప్రస్తుతం వరకు దిల్షాన్ మధు శంక గాయాల పాలయ్యి వైదొలగడం వల్ల బలహీనపడ్డ బౌలింగ్ విభాగంలో సమీరా బలోపేతం చేశాడు అనుకున్నా సమయంలో ఇతను కూడా గాయాలపాలవడం లంకేయులకు పెద్ద దెబ్బ. మధు శంక గాయాల పాలైన విషయం తెలిసిందే తొడ కండరాల్లో గాయం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది.

కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని తేలింది. ఇద్దరు బౌలర్లు గాయాల పాలపడి టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి రావడంతో శ్రీలంక ఎంతో బాధలో కూరుకుపోయింది. టీమిండియా జట్టులో కూడా ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి తెరుకోవడం జరిగింది. శ్రీలంక జట్టుకు రి ప్లేస్మెంట్ ప్లేయర్స్ కూడా పెద్దగా ఉన్నట్లు అనిపించడం లేదు. తద్వారా ఈ పరిస్థితి కారణంగా ఆ జట్టు విజయా అవకాశాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button