India VS New Zealand:ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి వన్డే మ్యాచ్
India VS New Zealand oneday match 2022: టి20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ప్రస్తుతం వన్డే సిరీస్ పై దృష్టి పెట్టింది. ఈ వన్డే సిరీస్ ఆక్లాండ్ వేదికగా జరుగుతుంది . న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం నవంబర్ 25 తారీఖున జరగనుంది.
తుది జట్టు అంచనా:-
శికర్ దావన్ కెప్టెన్, శుభ మాన్ గిల్, శ్రేయాష్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రీషపు పంత్, సంజు సాంసన్, అర్షిదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్.
మరి ఈ సిరీస్లో టీమిండియా కు సంబంధించిన సీనియర్ ప్లేయర్స్ కొంతమంది దూరంగా ఉన్నారు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ సిరీస్ కు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా కు శిఖర్ ధావన్ కొత్త కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు.
ఇది ఇలా ఉండగా టీమిండియా తరఫున న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా తొలి వన్డే మ్యాచ్లో యువ ఫెసర్ అయినా ఉమ్రాన్ మాలిక్ భారత్ తరపున మళ్లీ ఆడదానికి అవకాశం ఉంది. టీ ట్వంటీ సిరీస్ కి కూడా ఉమ్రాన్ మాలిక్ ఎంపికైన బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ తొలి వన్డే మ్యాచ్లో ఇతని ఆడిపించాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అలాగే దీపక్ హుడా స్థానంలో వికెట్ కీపర్ అయినా సంజు శాంసన్ కు చోటు దక్కే అవకాశం కూడా ఉంది. ఇంకోవైపు ఫేసర్ దీపక్ చాహర్ తొలి వన్డే మ్యాచ్ నుంచి దూరమయ్యే అవకాశం కూడా ఉంది. ఈయన స్థానంలో యువ బౌలర్ అర్షదీప్ సింగ్ ఈ వన్డే మ్యాచ్లో ఆడనున్నట్లు సమాచారం. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఆక్లాండ్ వేదికకు చేరుకున్న టీమిండియా సేన.
ప్రాక్టీస్ ముమ్మరంగా చేస్తున్నట్లు సమాచారం. ఇక విజయం ఎవరిని వరుస్తుందో చూడాలి. శుక్రవారం నవంబర్ 25వ తారీఖున న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా జరగనుంది. ఇండియా జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్న శిఖర్ ధావన్.