Suryakumar yadav: కోహ్లీ తనను ఇలా అన్నాడని చెప్పిన సూర్యకుమార్
టీమిండియా జట్టులోనే 360 డిగ్రీస్ ప్లేయర్ అని పేరు తెచ్చుకున్న క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్. ప్లే గ్రౌండ్ లో ఏ మూలకైనా, ఎప్పుడైనా, ఏ బాల్కైనా కూడా సిక్సర్ల వర్షం కురిపించే ఏకైక వ్యక్తి సూర్య. మ్యాచ్లో తన ఆట తీరని చూసి విరాట్ కోహ్లీ ఈ విధంగా అన్నాడంటూ చెప్పుకొచ్చాడు.
వీడియో గేమ్ ఆడుతున్నావా? అని విరాట్ కోహ్లీ సుదీర్ కుమార్ యాదవ్ గురించి అన్నాడని చెప్పుకొచ్చా డు. ఒక మ్యాచ్లో విరాట్ కోహ్లీ తో కలిసి బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది అంటూ గుర్తు చేసుకున్నాడు. జట్టులోకి వచ్చి చాలా కొద్ది కాలమే అయింది.
కొద్ది కాలమే అయినప్పటికీ వరల్డ్ బెస్ట్ బ్యాటర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్రజెంట్ సూర్య టెస్ట్ ఫార్మేట్ అరంగేట్రం పై ఫోకస్ పెట్టాడు. తాజాగా ఓ చానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. ఆటగాడిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు.
ఎంత పేరు సంపాదించినా తాను వ్యక్తిగతంగా ఇంతకుముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని చెప్పుకొచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అభిమానులు గుర్తు పడుతూ సూర్య అని పిలుస్తూ ఉన్నారు ఇది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్టార్ క్రికెటర్ గా పేరు వచ్చిన తర్వాత కుటుంబంతో బయటికి వెళ్లాలన్న కొన్ని పరిమితులు ఉన్నాయి.
ఇంతకుముందు అయితే కుటుంబంతో సినిమాలకు, విందులకు వెళ్లే వాళ్లము. నేను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో ఓ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు కోహ్లీ నా దగ్గరికి వచ్చివీడియో గేమ్ ఆడుతున్నావా? వేరే లెవెల్ లో బ్యాటింగ్ చేస్తున్నావు అని అన్నాడు. కోహ్లీ నోటి నుంచి అలాంటి మాటలు వినడం నాకు చాలా సంతోషం అనిపించింది.
అంటూ తన ఆనందాన్ని తెలియజేశా డు. టి20 ప్రపంచ కప్ టైం లో విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ కి టేక్ ఏ బో ఇచ్చాడు. ఈ సంవత్సరంలో 31 t20 మ్యాచ్ ఆడాడు. 46. 56 సగటుతో క్రికెట్ ఆడడు.187.43 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.1164 పరుగులు చేశాడు.
ఈ ఇయర్లో t20 లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా ఎక్కువ సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. మొత్తం మీద 42 t20 మ్యాచ్లు ఆడాడు. 44 సగటుతో,181 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు.1408 పరుగులు చేయగలడు. వరల్డ్ బెస్ట్ బెటర్ గా పేరు సంపాదించుకున్నాడు. 360 డిగ్రీస్ బ్యాటర్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు.