Sports News

Rohith Sharma: సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న రోహిత్ శర్మ, రితిక

టీమిండియా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ డిసెంబర్ 13 2022 నా తన సెవెంత్ వెడ్డింగ్ అనివర్సరీ నీ జరుపుకున్నారు.రితికా సజ్‌దేహ్‌ రోహిత్ భార్య పేరు. రోహిత్, రితిక 2015 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి తమ జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఈ జంట వారు సరదా గా గడిపిన క్షణాలలో తీసిన ఫొటోస్ నీ ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు.

రోహిత్ శర్మ వ్యక్తిగత సమాచారం-
1987 ఏప్రిల్ 30వ తేదీన భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన నాగపూర్ అనే ప్రాంతంలో జన్మించాడు. రోహిత్ శర్మ పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ. ఈయన భారతీయ అంతర్జాతీయ క్రికెటర్.
ప్రజెంట్ ఉన్న టీం ఇండియ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. కుడి చేతి వాటం కలిగిన బ్యాట్స్మెన్. 2019లో ఐసిసి పురుషుల ఓ డి ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, 2015 లో అర్జున అవార్డు, 2020లో ఎంతో ప్రాముఖ్యత చెందిన మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డుని పొందాడు.

సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న రోహిత్ శర్మ, రితిక

టీమిండియన్ ఓపెనర్ అయినా రోహిత్ శర్మ వేలికి గాయం కావడంతో పెళ్లిరోజు వేడుకలు తగ్గే అవకాశం కూడా ఉంది. అతని భార్య రితిక రోహిత్తో కలిసి ఉన్న ఏడు ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి రోహిత్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ కు కూడా రోహిత్ దూరమయ్యారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబైలో ఉన్నాడు. అతని వేలికైన గాయం మానడం కోసం వైద్య పరీక్షలు చేసుకుంటున్నాడు.ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏడవ పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్నారు.రోహిత్, రితిక వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తమ ఏడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. రోహిత్, రితిక కూతురు స మైరా ప్రత్యేకంగా ప్లాన్ చేసింది.

తన తల్లిదండ్రులను ప్రత్యేక కార్డుతో ఆశ్చర్యపరిచేందుకు ఈ చిన్న అమ్మాయి రెడీగా ఉంది. రోహిత్ అభిమానులు వీరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి రోజును పురస్కరించుకొని రితిక షేర్ చేసిన ఏడు ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version