Cricket

Cricket:ఆఫ్రిదీ రికార్డ్ క్రియేట్ చేసి సరిగ్గా ఇప్పటికి 26 ఏళ్లు.

గ్రౌండ్ లోకి వచ్చినామా.. దంచినామా.. అనే మైండ్ సెట్ తో బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు అఫ్రిదీ. ఈ ఆటగానికి టుకూ టుకూ ఆట అతనికి తెలియదు. మొదటి బంతిని చివరి బంతిని సిక్స్ కొట్టేందుకే చూసే స్పెషల్ బ్యాటర్. వరల్డ్ వైడ్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్లుగా పేరుగాంచిన ఎబీ డివిలియర్స్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే ముందుగా వీరబాదుడికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడీ మాజీ కెప్టెన్గా షాహిద్ అఫ్రిది.

ఆఫ్రిదీ రికార్డ్ క్రియేట్ చేసి సరిగ్గా ఇప్పటికి 26 ఏళ్లు.
ఆఫ్రిదీ రికార్డ్ క్రియేట్ చేసి సరిగ్గా ఇప్పటికి 26 ఏళ్లు.

వన్డే క్రికెట్లో ఒక జట్టు 250 పరుగులు చేస్తే…పెద్ద స్కోర్ గా ఒక ప్లేయర్ 100, 120 బంతుల్లో సెంచరీ చేస్తే వేగవంతమైన ఇన్నింగ్స్ గా పరిగణిస్తున్న రోజుల్లో.. ఈ ఆటగాడు ఒక తుఫాన్ ఎండింగ్స్ అంటే ఏంటో? ఆ తుఫాన్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో? వరల్డ్ వైడ్ క్రికెట్ కు చూపించాడు. 1996లో శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడి.. అప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో తక్కువ బంతుల్లో 37 బందుల్లోనే సెంచరీ చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ని సృష్టించాడు.

వన్డేల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సాధ్యమేనా అనే అనుమానం ఆటగాళ్లకు కలిగేలా వరల్డ్ వైడ్ క్రికెట్ లోకం ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ ఆటగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సిక్సులతో శ్రీలంక బౌలింగ్ ఎటాక్ ను తుతునియలు చేశాడు. గ్రౌండ్ లో ఉన్న బౌండరీ లైను తన బ్యాట్ కు అతి దగ్గరగా ఉన్నట్లు అతను బ్యాట్ కు బంతి తగిలితే అది బౌండరీ అవతలే పడింది.

అంతర్జాతీయ క్రికెట్ లో రెండో మ్యాచ్ ఆడుతున్న నునూగు మీసాల కుర్రాడు ఆడిన ఈ ఇన్నింగ్స్ కు లంకతో పాటు వరల్డ్ వైడ్ క్రికెట్ ఆశ్చర్యపోయింది. ఆ ఇన్నింగ్స్ కు ఒక మెరుపులా మెరిసిన చాలా ఏళ్లపాటు ఒక చెదరని రికార్డుగా మిగిలిపోయింది. అఫ్రిదీ సృష్టించిన ఈ ఇన్నింగ్స్ కు నేటితో సరిగ్గా 26 ఏళ్ళు అవుతుంది.

1996 అక్టోబర్ 4 న పాకిస్తాన్ -శ్రీలంక మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో అఫ్రిదీ అనే 17 సంవత్సరాల కుర్రాడు ఈ ఇన్నింగ్స్ సృష్టించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు 11 సిక్సులతో 102 పరుగులు చేశాడు. 37 బంతుల్లోనే సెంచరీ మార్కను చేరుకొని వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీతో కొత్త చరిత్రను రాశాడు. ఆ మ్యాచ్లో అఫ్రిదీ తో పాటు అప్పటి పాక్ కెప్టెన్ సాయి దాన్వర్ కూడా సెంచరీ చేయడంతో పాక్ 371 పరుగులు భారీ స్కోర్ కొట్టింది. బదులుగా లంక 49.5 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆల్ ట్ అయింది.

వన్ డౌన్ లో వచ్చి ఫోర్లు సిక్స్ల వర్షం కురిపిస్తున్న అఫ్రిదీ ని డిసిల్వా అవుట్ చేయడంతో శ్రీలంక ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే ఆ ఫామ్ మరింత కొనసాగేది. అఫ్రిదీ ఆడింది సచిన్ బ్యాట్ తోనే. తన వద్ద ఉన్న సచిన్ బ్యాట్ ను వకార్ యూనిస్ అఫ్రిదీ కి ఇవ్వడం.. సచిన్ ఇచ్చిన బాటతో అఫ్రిదీ ఆడిన ఆట అద్భుతం సృష్టించడం అలా అలా జరిగిపోయాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version