Cricket

టీ20 వరల్డ్ కప్ టికెట్లకు భారీ క్రేజ్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు లక్షల ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్

టి20 వరల్డ్ కప్ 2022 మరికొన్ని రెండు రోజులలో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న ఈ ఏడో టీ20 వరల్డ్ కప్ ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన కొన్ని రోజులకే టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్.

ఏడాది క్రితమే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు కేవలం 3 నిమిషాల్లో అయిపోయాయి. ఇండో, పాక్ పాక్ మ్యాచ్ కి బీభత్సమైన క్రేజ్ ఉందని గమనించిన ఆస్ట్రేలియా, మిగిలిన స్టాండ్స్ నీ మరమ్మతులు జరిపించి, మరోసారి టికెట్లను అమ్మేసింది. మొత్తం ఇప్పటిదాకా మెల్ బోర్న్ లో జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కి 90 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట.

మెల్ బోర్న్ స్టేడియం పూర్తి కెపాసిటీ 100024, అయితే పూర్తి కెపాసిటీతో ఈ మ్యాచ్ జరిగితే లక్షమంది ప్రేక్షకుల కేరింతల మధ్య భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. ఇదే జరిగితే టీ20 వరల్డ్ కప్ 2022 కొత్త రికార్డు నమోదు అవుతుంది.

ఇప్పటిదాకా మెల్ బోర్న్ లో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 93,031 మంది ప్రేక్షకులు హాజరు కావడమే ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. ఆ రికార్డును భారత్, పాక్ మ్యాచ్ చెరీపేసినట్టే అవుతుంది.

అంతే కాకుండా ప్రపంచ దేశాల నుండి టి20 వరల్డ్ కప్ 2022 మ్యాచులు చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియా చేరుకుంటారు. క్వాలిఫైయర్ మ్యాచ్లో దగ్గర నుంచి ఫైనల్ మ్యాచ్ దాకా ఇప్పటికే ఆరు లక్షల టికెట్లు అమ్మేసింది ఐసిసి. మ్యాచ్లో జరిగే కొద్ది ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

టి20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఇప్పటికే టీమ్ ఇండియాతో పాటు ఇంగ్లాండ్ వంటి జట్లు ఆస్ట్రేలియా చేరుకున్నాయి. పొట్టి ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తో పర్యటిస్తూ ఆసీస్ తో టి20 సిరీస్ ఆడుతుంది. భారత్ పర్యటనను పూర్తి చేసుకున్న సౌత్ ఆఫ్రికా తో పాటు త్తృపాక్షిక సిరీస్ లో పాల్గొన్న న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా త్వరలో ఆసీస్ గడ్డమీద అడుగుపెట్టబోతుంది.

అక్టోబర్ 16 నుంచి క్వాలిఫైయర్ రౌండ్స్ జరగబోతుంటే అక్టోబర్ 2022 నుంచి గ్రూప్స్ (సూపర్ 12 రౌండ్) మ్యాచ్లో జరుగుతాయి. సిడ్నితోపాటు మెల్ బోర్న్, పెర్త్, ఆడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబర్ట్ నగరాల్లో మ్యాచులు జరగబోతున్నాయి. గ్రూప్ స్టేజీ నుంచి ఫైనల్ మ్యాచ్ దాకా ఒక్కో రెండ్కి ఒక్కోలా టికెట్ ధరలు ఉంటాయి..

క్వాలిఫైయర్ రౌండ్ మ్యాచులు చూడాలనుకుంటే పిల్లలు 5 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.250), పెద్దలు 20 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.1050) కనీస ధరగా చెల్లించాల్సి ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ఇది 125 డాలర్లకు పెరుగుతుంది. అంటే ఫైనల్ మ్యాచ్ చూడాలంటే దాదాపు 6500 పెట్టి టికెట్ కొనాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్లను భారీ డిమాండ్ ఉండడంతో బ్లాక్ మార్కెట్లో లక్షలు పలుకుతున్నాయట.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button