Cricket

Virat Kohli:విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని చెప్పిన బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్

Virat Kohli:క్రికెట్ ఆటకు సంబంధించి నవంబర్ రెండో తేదీ బుధవారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. దీంట్లో నూరుల్ హసన్ ,కోహ్లీ పై ఒక అభ్యంతరాన్ని తెలిపారు. చేతిలో బాల్ లేకపోయినా విరాట్ కోహ్లీ త్రో చేసినట్లు చూపించాడని అభ్యంతరం తెలిపిన నురుల్ హసన్. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో ఏడవ ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ టైంలో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని అభ్యంతరం తెలిపాడు. అడిలైడ్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరిగింది.

మ్యాచ్లో టీమిండియా జట్టు నిర్ణిత 20 ఓవర్లలో184/6 స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ జట్టుకు 185 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో భారత్ చేతిలో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయిన బంగ్లాదేశ్ జట్టు మరో కొత్త వివాదాన్ని తీసుకొచ్చింది.

ఫేక్ ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ అని చెప్పిన బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్

విరాట్ కోహ్లీ ఫీలింగ్ ను తప్పు పడుతూ దీనికిగాను ఐదు పరుగులు జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. అయిపోయిన మ్యాచ్ ఫలితాన్ని మార్చాలన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ ఉన్నట్లు కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో ఏడవ ఓవర్లో, చేతిలో బాల్ లేకపోయినా తో చేసినట్లు చూపించాడని నూరుల హసన్ అభ్యంతరం తెలిపారు.

కానీ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వర్షం రావడంతో సుమారు ఒక గంట పాటు మ్యాచ్ ఆగడం జరిగింది. వర్షం వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ జట్టుకు తన లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించింది.

ఏడో ఓవర్లో షార్ట్ రూపంలో తన వైపు బంతి రావడంతో దాన్ని అర్షదీప్ పట్టుకొని దినేష్ కార్తీక్ వైపు విసిరాడు. వీరిద్దరి మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ అర్షదీప్ పట్టుకొని విసిరిన బంతిని తాను పట్టుకుని విసిరేసినట్లు చేతులను త్రో చేశాడు. ఈ విషయం కోసం బంగ్లాదేశ్ బ్యాటర్, బౌలర్ అయిన నూరుల్ హసన్ అభ్యంతరం తెలిపారు.

“మైదానం తడిగా ఉన్నందున దీని ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు. బాల్ చేతిలో లేకపోయినా నకిలీ త్రో చేసినందుకు ఐదు పరుగులు పెనాల్టీ వేయాలన్నది నా ఉద్దేశమని నూరుల్ హసన్ తెలిపాడు”ఈ విషయంపై నేటిజన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు.

ఈ విషయాన్ని అప్పుడే చెప్పొచ్చుగా? అని కొందరు, బాలు ఎలా త్రో చెయ్యాలో చూపిస్తున్నాడు అయ్యా! అని మరికొందరు, ఈ విషయాన్ని అప్పుడే చెప్పి ఉంటే ఎంపైర్లు తన నిర్ణయాన్ని ప్రకటించేవారుగా అని మరికొందరు ప్రతిస్పందించారు. నిజానికి ఈ సన్నివేశాన్ని మొత్తాన్ని ఫీల్డ్ ఎంపైర్ పరిశీలిస్తూనే ఉన్నారు. తప్పై ఉంటే అక్కడే ఎంపైర్ చెప్పేవాడు.

ఫేక్ ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ అని చెప్పిన బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్

చివరికి ఈ మ్యాచ్ పూర్తయింది.145/6 స్కోర్ చేసి బంగ్లాదేశ్ జట్టు టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా టీమిండియా జట్టు పాయింట్స్ టేబుల్ లో ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version