Cricket

HAT-TRICK: T20 World cup 2022లో హ్యాట్రిక్ సాధించిన కార్తీక్

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మొదటి మ్యాచ్లో శ్రీలంక పసికూన నమీబియా చేతిలో ఓడిపోవడం జరిగింది. శ్రీలంక బ్యాట్స్మెన్ తక్కువ పరువులకు ఆల్ అవుట్ కావడంతో నమీబియా జట్టు సులభంగా ఈ మ్యాచ్ లో గెలిచింది. శ్రీలంక తన రెండవ మ్యాచ్లో యూఏఈ ఆడింది.

HAT-TRICK: T20 World cup 2022లో హ్యాట్రిక్  సాధించిన UAE ఆటగాడు కార్తీక్
KATHIK

ఈ మ్యాచ్లో శ్రీలంక యూఏఈ పై 152 పరుగులు సాధించింది. 8 వికెట్లను కోల్పోయి శ్రీలంక ఈ స్కోర్ సాధించడం జరిగింది.యూఏఈ బౌలర్లలో స్పిన్ బౌలర్ కార్తిక్ మోయప్పన్ శ్రీలంక పై హ్యాట్రిక్ సాధించి 2022 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన ఫస్ట్ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. నాలుగో బంతికి రాజపక్ష, కాసిఫ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన అసలంక కీపర్ అరవింద్ కు క్యాచ్ ఇచ్చి ఔటాయ్యాడు.

14వ చివరి బంతికి శనగ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కార్తికేయన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేసినప్పటికీ యూఏఈ బ్యాటింగ్లో మాత్రం విఫలం అయింది. కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంకపై 79 పరుగుల తేడాతో యూఏఈ ఓడిపోయింది. ఇప్పటివరకు జరిగిన టి20 వరల్డ్ కప్ లలో సాధించిన హ్యాట్రిక్ లలో కార్తికేయను సాధించిన హ్యాట్రిక్ ఐదవది. గతంలో నలుగురు బౌలర్లు ఈ ఘనతను సాధించారు.


టి20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు.


బ్రెట్ లీ: 2007లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ బ్రెట్ లీ బంగ్లాదేశ్ పై హ్యాట్రిక్ సాధించి వరల్డ్ కప్ లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు.

కర్టిస్ కంపేర్: ఐర్లాండ్ కు చెందిన ఈ ఆటగాడు 2021లో అబుదాబిలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్ పై ఘనత సాధించారు.world cup లో హ్యాట్రిక్ సాధించడం రెండవ బౌలర్ గా రికార్డు నమోదు చేశాడు.

వన0దు హసరంగా: శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్ బౌలర్ దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో హసరంగా hat_trick సాధించడం జరిగింది. t20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన మూడవ బౌలర్గా hasaranga రికార్డు నమోదు చేశాడు.

kasigo rabada: దక్షిణాఫ్రికా చెందిన మ్యాచ్లో రబడ హ్యాట్రిక్ సాధించడం జరిగింది. వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్గా రబడా రికార్డు నమోదు చేశాడు.
కార్తీక్ ముయ్యప్పన్: యూఏఈ కు చెందిన స్పిన్ బౌలర్.2022 వరల్డ్ కప్ మ్యాచ్లో 15వ ఓవర్ లో వరుసగా రాజపక్షి, అసలంక, శనక వికెట్లు తీసి 2022లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్గా రికార్డు నమోదు చేశాడు. అలాగే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన 5వ బౌలర్ గా కూడా రికార్డు నమోదు చేయడం జరిగింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version