Cricket

Virat kohli: World Cup T20 Records.

#virat kohli:ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్గా పేరు సంపాదించిన కోహ్లీ టి20 లలో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. 2022 t20 వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ప్రారంభ పాకిస్తాన్ మ్యాచ్ లో అర్థ సెంచరీ తో ఇండియాను మరొకసారి గెలిపించాడు. తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్ లో కూడా half century చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

virat kohli

విరాట్ కోహ్లీ రికార్డ్స్

క్రికెట్లో రన్ మెషీన్ గా పేరు సంపాదించిన కోహ్లీ అన్ని ఫార్మాట్లలో రికార్డులను నమోదు చేశాడు. వన్డే టి20 టెస్ట్ మ్యాచ్లలో నేటితరం ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డులను సాధించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. టి20 రికార్డ్స్ విరాట్ కోహ్లీ టి20 లలో మంచి ప్రదర్శనతో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు 113 మ్యాచ్ లలో 105 ఇన్నింగ్స్ లు ఆడి 3932 పరుగులు చేశాడు. టి20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు 50 కి పైగా సగటు కలిగి ఉన్న ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రమే.

టి20 వరల్డ్ కప్ రికార్డ్స్

టి20 వరల్డ్ కప్ లలో కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. వరల్డ్ కప్ టి20 లలో 1065 పరుగులు కోహ్లీ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సగటు కలిగిన ఆటగాడుగా కూడా విరాట్ కోహ్లీ రికార్డ్ నమోదు చేశాడు. వరల్డ్ కప్ లో 88.75 సగటుతో ఈ రికార్డును నమోదు చేశాడు. వరల్డ్ కప్ లో ఈ సగటును ఎవరు కూడా అందుకోలేనంత స్థానంలో ఏర్పరిచాడు.

ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్

అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు ఏర్పరిచాడు. ఐపీఎల్ లో మొత్తం 6624 పరుగులు చేశాడు. ఐపీఎల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు. ప్రారంభం నుండి బెంగళూరు జట్టు తరుపున మాత్రమే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఐపీఎల్ వేలంలోకి రాని ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే.

మ్యాన్ ఆఫ్ ది సిరీస్

టి20 వరల్డ్ కప్ టి20 వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పొందిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. 2014, 2016 లలో జరిగిన టి20 వరల్డ్ కప్ లలో MOS లు సాధించాడు. రెండు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇంతవరకు ఏ ఆటగాడు సాధించలేదు. 2022లో కూడా అతని ప్రదర్శన బాగా ఉండటంతో మరొక MOS గెలవచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

జెర్సీ నెంబర్ 18

ప్రతి ఆటగాడు తన జెర్సీపై ఒక నెంబర్ వేసుకుంటాడు. అది తన లక్కీ నెంబర్ కావచ్చు. అలాగే కోహ్లీ కూడా తన జెర్సీపై 18 నెంబర్ను ధరిస్తాడు. దాని వెనక ఒక పెద్ద కారణం ఉంది. ఆ నెంబర్ ను తన తండ్రికి గుర్తుగా ధరిస్తాడు. 2006 డిసెంబర్ 18న తన తండ్రి ప్రేమ కోహ్లీ మరణించాడు. అప్పుడు కోహ్లీ వయస్సు 18 సంవత్సరాలు. ఆ రోజున రంజి మ్యాచ్ ఉండడంతో తన తండ్రి మరణ వార్తను భరిస్తూ ఆప్ సెంచరీ తో తన టీం ఢిల్లీని గెలిపించాడు. తన తండ్రి ప్రేమకు గుర్తుగా తన జెర్సీపై 18 నెంబర్ను ధరించడం జరుగుతుంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version