Sports News

T20 World Cup 2022: టీమిండియా అభిమానుల స్పందన

T20 World Cup 2022: టి20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్లో భాగంగా నిన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా పై ఇంగ్లాండ్ జట్టు భారీ విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పూర్తయిన తర్వాత టీమిండియా 168/6 స్కోర్ చేసింది. దీనికిగాను 10 వికెట్ల తేడాతో 16 ఓవర్లోనే టార్గెట్ ను రీచ్ అయ్యి ఇంగ్లాండ్ టీమిండియా పై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది.

ఈ మ్యాచ్ గురించి టీమ్ ఇండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెట్టిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.”ముందే ఒడి మంచి పని చేశారు. ఇదే ఆటతో ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడితే తట్టుకోలేకపోయేవాళ్లం”. అని గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కొందరు టీం ఇండియా అభిమానులు స్పందన ఇది.

కానీ వాస్తవానికి అదే నిజం. సెమీ ఫైనల్ మ్యాచ్లో గెలిచి పాకిస్తాన్తో ఇదే ప్రదర్శనతో ఓటమిపాలయుంటే టీమిండియా అభిమానుల బాధ అంతా ఇంత ఉండదు. ఏదో మనకు లక్ కలిసి వచ్చి మ్యాచ్ గెలవాలి తప్ప, ఇప్పుడున్న ఈ జట్టుకు ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకునే అంత సత్తా ఉందా అంటే సందేహమే! బౌలింగ్ లో తప్పులు, సరైన వ్యూహాలు లేకపోవడం, కెప్టెన్ ఫామ్ లో లేకపోవడం, ఇన్ని లోపాలు పెట్టుకొని టైటిల్ సాధిస్తారు అంటే ఎవరికి నమ్మకం ఉండదు.

భారత్ ఓటమితో బాధలో టీమిండియా అభిమానుల స్పందన

కానీ ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నారంటే?
“నాకౌట్ మ్యాచ్లు ముఖ్యమైనవి. అందులో మెరుగైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో ఒక్క నాకౌట్ మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్ల ప్రదర్శన పై ఒక అంచనాకు రాకూడదు”. ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలు ఇవి.

సంవత్సరమంతా ప్రాక్టీస్ చేశారు కానీ ఫలితం ఏమీ లేదు–
కిందటి సంవత్సరం t20 వరల్డ్ కప్ 2021 టోర్నమెంట్ లో కూడా టీమిండియా జట్టు తొలిదశలోనే వెనుదిరిగింది. కానీ ఈ ఏడాది ఈ కప్ ఖచ్చితంగా కొట్టాలని బాగానే ప్రాక్టీస్ చేశారు. గాయాల కారణంగా కొంతమంది ముఖ్యమైన ప్లేయర్స్ ఆటకు దూరమయ్యారు.

కొత్తగా ఆటగాళ్లను బరిలోకి దింపి వారికి ఒక అవకాశం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ దానికి సంబంధించిన ఒక ప్లాన్ చేసుకోలేక, మ్యాచ్ మ్యాచ్ కు మార్పులు చేసుకుంటూ వచ్చి ఎవరికి కూడా సెట్ అయ్యేంతవరకు అవకాశం ఇవ్వలేకపోయింది. అర్షదీప్ ఒక్కడు కొద్దిగా స్థిరపడ్డాడు. పెద్దగా టి20 లు ఆడని షమీ, అశ్విన్లకు ఈ ఛాన్స్ ఇవ్వడం పై కారణాలేంటో కూడా తెలీదు. ఉమ్రాన్ మాలిక్ కు కూడా మీరే లాగానే ఒక ఛాన్స్ ఇచ్చి ఉంటే ప్రపంచ కప్ పోటీల్లో బాగా యూస్ అయ్యేవారు. కానీ ఛాన్స్ ఇవ్వలేకపోయారు.

కొంతకాలంగా ఆఫ్ స్పిన్నర్ లా ఆధిపత్యం తగ్గిపోయి చాలా రోజులైంది. ప్రస్తుతం ప్రపంచ కప్ లో ఆయన లీగ్ క్రికెట్ లో అయినా కూడా మనికట్టు స్పిన్నర్ లే హవా. భారత స్పిన్నర్లకు సంబంధించి చాహల్, వరుణ్ చక్రవర్తి, రవి భీష్నోయ్ లాంటి మణికట్టు ప్లేయర్స్ మెరుగైన ప్రదర్శన ఇస్తూ వస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీరిని ప్రపంచకప్ కోసం ఎంచుకోకుండా అశ్విన్, అక్షర్ పటేల్ లను ఎంపిక చేయడానికి కారణాలేంటో తెలియదు. అక్షర్, అశ్విన్లు చిన్నచిన్న మ్యాచులు మాత్రమే తమ ప్రదర్శన చూపించేవారు. పెద్ద మ్యాచులు ఆడలేదు.

కానీ ఎందుకు వీళ్ళని ప్రపంచకప్ ఆటకు పెంచుకున్నారో అని అభిమానులు సందేహం. ఒక బౌలర్ బంతి పట్టుకుంటే పరుగులను కట్టడి చేస్తారనో, వికెట్లను తీస్తాడని అనుకుంటారు. కానీ జట్టు అవకాశాలను తగ్గిస్తారు అని తెలిసినప్పుడు వీల్లను ఎందుకు ఎంపిక చేసుకోవాలని అభిమానులు బాధపడుతున్నారు.

కెప్టెన్ ప్రత్యేకత ఏముంది?

కెప్టెన్ గా విరాట్ తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. కానీ కెప్టెన్ ముద్రను ఈ ప్రపంచకప్ లో కూడా రోహిత్ వేయలేకపోయాడు. బ్యాటింగ్ చేయలేకపోవడం, తుది జట్టు ఎంపిక చేసే విషయంలో, బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాల్లో కూడా రోహిత్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కెప్టెన్ కంటతడి పెట్టాడు:-
టి20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్లో సెకండ్ సెమి ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయపాలైంది. టీమిండియా ఓటమి ఆటగాళ్ల ను బాధతో ముంచెత్తింది. ఈ మ్యాచ్లో ఓటమి తట్టుకోలేక కెప్టెన్ రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నారు. ముఖంపై చేతులు పెట్టుకొని తల కిందికి ఉంచుకుని కూర్చున్న రోహిత్ కంటతడి పెట్టుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించాడు.

టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ రోహిత్ శర్మ ఓదార్చాడు. ఈ మ్యాచ్పై టీమిండియా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మ్యాచ్ గెలవలేకపోవడం వాళ్ళని చాలా బాధకి గురి చేసింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button
Exit mobile version