T20 World Cup: అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్స్.
టి 20 మ్యాచ్లు అంటేనే బ్యాటింగ్ కోసమే అన్నట్టు బ్యాటర్స్ విధ్వంసం గా ఆడుతుంటారు. మ్యాచ్లో మొదటి బంతి నుండే బౌండరీల ద్వారా భారీ స్కోర్స్ సాధించాలని అని అనుకుంటారు. ఈ బౌండరీలలో సిక్సుల ద్వారా స్కోరు మరింత వేగంగా పెరుగుతుంది. ప్రతి బంతిని సిక్స్ కొట్టి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలని అభిమానులు కూడా అనుకుంటారు. 2007- 2021 వరకు జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్స్ యొక్క వివరాలు పరిశీలిద్దాం.
1.క్రిస్ గేల్:
క్రికెట్ బాస్ గా పేరు పొందిన ఈ వెస్టిండీస్ బ్యాట్ లో దిగ్గజం. సిక్స్లను అవలీలగా కొట్టగలడు. పొడవుగా, బలంగా ఉండే ఈ ఆటగాడు బంతిని అవలీలగా స్టేడియం బయటకు పంపగలడు. ఇతను కొట్టిన సిక్స్ ల వల్ల అభిమానులు గాయాల పాలవడం అనేకమార్లు జరిగింది. ఈ ఆటగాడు కేవలం 33 మ్యాచ్ లో 63 సిక్సెస్ కొట్టి 965 పరుగులు తీసి,అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు.
2.యువరాజ్ సింగ్:
ఇండియాకు చెందిన ఈ మాజీ ఆల్రౌండర్ సిక్స్లను చాలా సులభంగా కొడతాడు. ఇతని కెరీర్ లో ఫోర్ ల కంటే సిక్సులు కొట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపేవాడు. 2007 t20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కు చెందిన బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి రికార్డు సృష్టించాడు. ఈ ఆరు సిక్స్ లను ఆరు రకాలుగా కొట్టాడు. ఇతను మొత్తం టి20 వరల్డ్ కప్ కెరీర్ లో 33 six లతో, అత్యధిక సిక్సులు కొట్టిన వారి జాబితాలో రెండవ స్థానంలో గలడు. ఇతను బ్యాటింగ్ తో పాటు, అద్భుతమైన ఫీల్డర్ కూడా. ఫీల్డింగ్ నైపుణ్యంతో ఎంతో మందిని రన్ అవుట్లు కూడా చేశాడు. మరియు స్పిన్ బౌలర్ గా కూడా రానిచ్చాడు. 2011 వరల్డ్ కప్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
3.రోహిత్ శర్మ:
ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ మరియు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అయిన రోహిత్ శర్మ 33 t20 వరల్డ్ కప్ మ్యాచ్లలో 31 సిక్స్ లు కొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో మొత్తంగా 847 పరుగులు చేశాడు. అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానంలో గలడు.
4.డేవిడ్ వార్నర్:
ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు మూడు ఫార్మాట్లలో ఓపెనింగ్ చేస్తున్న ఆటగాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో కూడా ఆడుతున్నాడు. 30 t20 వరల్డ్ కప్ మ్యాచ్ లలో 31 సిక్సులు కొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో 762 పరుగులు చేశాడు. అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు.
5.శాన్ వాట్సన్:
ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్ రౌండర్ 24 t20 వరల్డ్ కప్ మ్యాచ్లలో 31 సిక్సులు కొట్టాడు. 31 సిక్స్ లతో టి20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఐదవ స్థానంలో గలడు. టి20 వరల్డ్ కప్లో మొత్తం 537 పరుగులు చేశాడు.
6.AB Devilliers:
సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ ఆటగాడికి 360 డిగ్రీలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. మైదానం చుట్టూ 81 డిగ్రీలు కొట్టగలిగే నైపుణ్యం ఉన్న ఆటగాడు 30 మ్యాచ్ ల్లో 30 సిక్సుల కొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో 717 పరుగులు సాధించాడు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు కొట్టిన జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నాడు.
7.Jos.Butler:
ఇంగ్లాండ్ కు చెందిన ఈ ఆటగాడు కీపర్ అండ్ బ్యాట్స్ మెన్. ప్రస్తుతం ఇంగ్లాండ్ కు టి20 జట్టులో కూడా ఆడుతున్నాడు. ఇతను మొత్తం 21 మ్యాచ్లలో 26 సిక్సులు కొట్టాడు మొత్తం టి20 లో 574 వరకు సాధించాడు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు సాధించిన వారి జాబితాలో ఏడవ స్థానంలో నిలిచాడు.
8.DJ. Bravo:
వెస్టిండీస్ కు చెందిన బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రానిచ్చాడు. ఇతను 34 మ్యాచ్ లలో 25 సిక్సులు కొట్టాడు. 25 సిక్సుల సహాయంతో టి20 వరల్డ్ కప్ లో 530 పరుగులు సాధించాడు. 25 సిక్సులతో 8వ స్థానంలో ఉన్నాడు.
9.Mahlela.Jayavardane:
శ్రీలంకకు చెందిన ఈ కుడి చేతి వాటం ఆటగాడు 31 మ్యాచ్లలో 1016 పరుగులు సాధించాడు ఇందులో 25సిక్సులు కొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్మెన్ల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.
10.JP. Duminy:
సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ బ్యాటర్ కేవలం 25 మ్యాచ్లలో 23 సిక్సులు కొట్టి అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్మెన్ల జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు.