ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రత్యేక వ్యాసం

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రత్యేక వ్యాసం లాంటిది మీ కోసం సమాజం కోసం.

సమాజంలో ప్రతి ఒక్కరికి పంపాల్సిన message ప్రతి ఒక్కరూ మీ గ్రూపులకు ,అందరికీ పంపండి.. ఖచ్చితంగా సమాజానికి మంచి జరుగుతుంది…..

అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచే గురువులందరికీ ప్రత్యేక గురు పూజోత్సవ శుభాకాంక్షలు అని చెప్పే ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన సత్యాలు.

వ్యక్తి గత తప్పులను గురువు స్థానానికి ఆపాదించి గురు స్థానాన్ని అగౌరవపరచకండి.

ఈ క్రింది తప్పులు ( పాఠశాలలో పొగ త్రాగేవారు, మద్యం తాగి వచ్చేవాళ్ళు, నోటికి అడ్డు అడుపులేకుండా మాట్లాడేవాళ్ళు,మరికొన్ని తప్పులు చేసేవాళ్ళు )గురు స్థానంలో ఉండే వాళ్ళు చేస్తే కేవలం అది వ్యక్తిగత తప్పుగా భావించండి శిక్షించండి. అంతేగానీ ఆ తప్పులను ఉపాధ్యాయ లోకానికి అంట గట్టి గురు స్దానానికి ఆపాదించి మీ టీచర్స్ అంతా ఇంతే అని అగౌరవపరచకండి…..

*ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పులకు వారు మాత్రమే శిక్ష అనుభవిస్తే బాగుంటుంది కానీ ఆ మాటలతో యావత్ ఉపాధ్యాయ లోకాన్ని ( *ఉపాధ్యాయులు అంతా ఇంతే అనే అభిప్రాయానికి రాకండి*)

తప్పు చిన్నది అయిన లేకపోతే పెద్ద తప్పు అయిన అది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించినది అంతేకానీ యావత్ ఉపాధ్యాయ లోకానిది కాదు…. కానీ నేడు గురు స్థానాన్ని ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు….

ఒక ఉపాధ్యాయుడు సమాజము కోరుకునే గొప్ప సమాజాన్ని ఇవ్వాలంటే వ్యక్తిగత తప్పులను గురు స్థానానికి ఆపాదించకండి…..

మీరంతా ఇంతే, ఏమి పని ఉంటుంది, ఊరికే వచ్చిపోతారు ఇలా తప్పుడు మాటలు మాట్లాడి గురుస్థానానికి విలువను కించపరిచేలా చేసి అగౌరవించకండి…

గురు స్థానాన్ని గౌరవించండి
గురుస్తానానికి విలువ ఇవ్వండి

ఇలాంటి సంకట పరిస్థితిలో కూడా గురువు తన బాధ్యతను మరువక తన వృత్తిని దైవంగా భావించే ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.