పోలీస్ కథల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి జనం కనెక్ట్ అయితే.. తెరపై ఏం చెప్పినా వింటారు. ఏం చూపించినా చూస్తారు. రొటీన్ కథలతో సైతం మెస్మరైజ్ చేయొచ్చు. అందుకే హీరోలంతా పోలీస్ అవతారాలు ధరించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు.
ఈమధ్య యువ హీరోలు సైతం ఖాకీ కట్టాలని తాపత్రయపడుతున్నారు.అల్లూరిని కథగా చెప్పలేం. ఎందుకంటే ఇందులో కథ ఉండదు. కొన్ని సంఘటనలు తప్ప మొత్తం అల్లూరి సీతారామరాజు ప్రయాణమే ఈ కథ. తన ఫస్ట్ పోస్టింగ్ నుంచి చివరి వరకు ఏం జరిగిందన్న విశేషాలు ఎపిసోడ్ల ద్వారా చూపిస్తూ ఉంటారు.
ప్రతి బదిలీకి ఒక కథ పోలీస్ స్టేషన్లోనూ ఒక కేసు ఎలా సాల్వ్ చేస్తారో తెరపై చూడాలి. శ్రీ విష్ణు ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడంలోనే శ్రీకాకుళంలో దొంగలను పట్టుకొని బంగారు డబ్బు రికవరీ చేస్తాడు. అల్లూరి అన్నల తాకిడికి ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్ కి బదిలీ చేస్తారు.
అన్నలని ఎలా దారిలోకి తెచ్చుకుంటాడో ఓ సీన్ ఇలా ఉంటుంది. అన్ని సీనులో బాగా భాగాలుగా చూపించబోతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండే డైలాగులు మరియు ఆవేశపూరితమైన నీతి నిజాయితీ వంటి ఇవన్నీ అల్లూరిలో కనిపిస్తూ ఉంటాయి.
సెకండ్ హాఫ్ లో కిడ్నాప్ డ్రామా పోలీస్ ఆపరేషన్ వీటితో సాగిపోతుంది. కిడ్నాప్ డ్రామా నీ మరింత డీటెయిల్ గా చూపించారు. ఈ ఎపిసోడ్ పోలీసుల యొక్క కర్తవ్యాన్ని చూపించడానికి వాడుకున్నారు. ఓవరాల్ గా దర్శకుడు కొన్ని కొన్ని సినిమాలలో బిట్లు తీసుకొని మరో సినిమా తీసినట్లుగా ఫీలింగ్ కలుగుతుంది తప్ప.
కొత్త సినిమా చూసిన అనే భావన రాదు. పోలీస్ కావాలని కలలు కంటున్నా ఉతేజంతో నింపడానికి తండ్రి అల్లూరి కథ చెప్తాడు. దర్శకుడికి ప్రతి సీనుపై ఇష్టం బాగా ఉన్నట్లుంది.సీన్ లెంగ్త్ ఎంత? ఎంత చెప్పాలి? అనే విషయాల్ని గాలికి వదిలేశాడు. ఉదాహరణకు తనికెళ్ల భరణి ఎపిసోడే ఓ చిన్న సైజు సినిమాలా ఉంటుంది.
దాన్ని అంత లెంగ్తీగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాత్ర కోసం శ్రీ విష్ణు చాలా కష్టపడ్డాడు. ప్రతి పోలీస్ కథలను ఏదో ఒక విధంగా కొత్త ధనo కనిపిస్తూ ఉంటుంది. ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. రొటీన్ సీన్లు కనిపిస్తూ ఉంటాయి.
రొటీన్‌సీన్లన్నీ గుది గుచ్చి అల్లూరి తీశారేమో అనిపిస్తుంది. అల్లూరి పాత్రలో ఆవేశం, స్పీచుల్లో అంతర్మథనం తప్ప.. కథలో బలం, సన్నివేశాల్లో నవ్యత ఎక్కడా కనిపించలేదు. దాంతో ఈ అల్లూరి గురి తప్పింది.