బాలకృష్ణ 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో షూటింగ్ జరుపుతున్న విషయం తెలిసింది. ఆ సినిమా ముగింపు దశకు వచ్చిందని తెలుస్తోంది.నేపథ్యంలో 108వ సినిమాకి దర్శకత్వంలో వహించబోతున్న అనిల్ రావిపూడి స్పీడ్ పెంచాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ముగించినట్లుగా సమాచారం అందుతుంది.
ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులలో అనిల్ రావిపూడి ఉన్నాడు. అందులో భాగంగా దర్శకుడు సినిమాలోని పాత్రాలకు నటులను ఎంపిక చేస్తున్నాడు. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం అరవింద్ స్వామిని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని సిని వర్గాల సమాచారం అందుతుంది.బాలయ్య సినిమాలో నటించేందుకు ఆ తమిళ స్టార్ హీరో ఓకే చెప్పాడు.
అందుకు ఆయన పారితోషకాన్ని భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఆ పారితోషకం అనుకున్న బడ్జెట్ వర్కౌట్ అవ్వదని దర్శక నిర్మాతలు భావించి ఆయనను ఎంపిక చేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో అరవింద స్వామి కి ఉన్న క్రేజ్ బాలయ్య 108 సినిమాలో నటిస్తే తప్పకుండా బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.
ఆయన చెప్పిన పారితోషకం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదని అంటూ దర్శకుడు భావిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తమిళ్ లో ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. గనుక భారీగా పారీతోషకం పెంచేసుకున్నాడు. తమిళ్ లో తీసుకుంటున్న పారితోషికంకు అధికంగా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆయన డిమాండ్ చేయడంతో ఆయన్ను ఎంపిక చేయాలనుకుని అంతలోనే వద్దులే అనుకున్నారట.
ఇలా బాలయ్య సినిమాలో నటించడానికి తమిళ్ హీరో ఇలా భారీగా డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి…